Dhurandhar 2: ‘నాకు ఇలాంటి సినిమాలు నచ్చవు’.. ‘ధురంధర్ 2’ పై విమర్శలు గుప్పించిన హీరో

ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివేంజ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు. ఇదే క్రమంలో కొందరు మాత్రం ఈ సినిమాను ప్రాపగండా మూవీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Dhurandhar 2: నాకు ఇలాంటి సినిమాలు నచ్చవు.. ధురంధర్ 2 పై విమర్శలు గుప్పించిన హీరో
Dhurandhar 2

Updated on: Mar 26, 2026 | 8:22 PM

ఏ సినిమా విడుదలకైనా దానిలోని మంచి చెడుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో బ్లాక్ బస్టర్ సినిమాల విషయంలోనూ చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. పుష్ప2, యానిమల్, కేజీఎఫ్ 2 వంటి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలపై కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ధురంధర్ 2 విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆదిత్య ధర దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తుడిచేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.1500 కోట్లకు చేరువలో ఉంది. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఆమీర్ ఖాన్ మేనల్లుడు, హీరో ఇమ్రాన్ ఖాన్ ధురంధర్ 2 సినిమాను నేరుగా విమర్శించకుండా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అతను సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నాడు. అలా తాజాగా తన ఫాలోవర్లతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే ఛాటింగ్ సెషన్ నిర్వహిచాడు. ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఇమ్రాన్ ఆసక్తికర సమాధానాలిచ్చాడు.

ఈ క్రమంలో ఒక నెటిజన్ ‘ దయచేసి మీరు ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న మ్యాచో పాత్రల వైపు చేయకండి’ అని సూచించాడు. దీనికి రిప్లై ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్.. ‘జుట్టు పొడవుగా పెంచుకుని, కోపంగా కనిపిస్తూ, ఒళ్లంతా రక్తం అంటించుకునే పాత్రలపై నాకు ఆసక్తి లేదు’ అని బదులిచ్చారు. ”ఆల్ఫా మేల్’ వంటి కొన్ని సినిమాలు వస్తున్నాయి, అంటే పురుషులు గొప్పవారని అర్థం. ‘మన సినిమాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ స్త్రీద్వేషాన్ని, విషపూరిత పురుషాధిక్యతను ప్రోత్సహిస్తున్న తీరు నన్ను కలవరపరుస్తోంది’ అని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. హీరో కామెంట్స్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇమ్రాన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు తప్పుపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us