Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

ప్రియుడి మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందీ అందాల తార. దీంతో తన శరీరం గురించి పట్టించుకోలేదు. ఫలితంగా భారీగా బరువు పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు జీవితంలోకి వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే భారీగా బరువు తగ్గి నాజూకుగా మారిపోయింది.

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?
Bollywood Actress

Updated on: Jun 01, 2025 | 6:10 PM

ఈ ముద్దుగుమ్మ గత కొన్ని నెలలుగా తన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. బాయ్ ఫ్రెండ్ గుండెపోటుతో మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. భారీగా బరువు పెరిగిపోయింది. అయితే మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోందీ అందాల తార. మళ్లీ సినిమాలు, సీరియల్స్ తో బిజీ కావాలనుకుంటోంది. ఇందుకోసం ఆమె ఆరు నెలల్లో ఏకంగా 55 కిలోల బరువు తగ్గింది. సాధారణంగా చాలా మంది మందులు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతుంటారు. కానీ ఈ నటి అలా కాదు. జిమ్ లో బాగా కష్టపడింది. వర్కౌట్లు చేసింది. కఠిన మైన ఆహార నియమాలను పాటించింది. దీని ఫలితంగా ఆమె శరీర బరువులో భారీ మార్పు వచ్చింది. కొన్ని ఆహార పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. వాటిలో మాంసం, చాక్లెట్, ఐస్ క్రీం, స్వీట్లు ముఖ్యమైనవి. వీటిని తినడం పూర్తిగా మానేసిందీ అందాల తార. రోజూ పసుపు నీరు, టీతో ఉదయాన్ని ప్రారంభించింది. కూరగాయలు, పెసరపప్పు మిరపకాయ లేదా దోశ, మెంతి పరాఠాలు తీసుకుంది. ఈ ఆహార పద్ధతులు శరీరంలోని కొవ్వును నియంత్రించడంలో సహాయపడుతాయి.

మధ్యాహ్న భోజనంలో చిరు ధాన్యాలు, సలాడ్లు, మొలకలు, స్క్రాంబ్లింగ్ టోఫుతోపాటు బహుళ ధాన్యాల పిండితో చేసిన రోటీలు ఎక్కువగా తీసుకునేదట. లైట్‌గా నెయ్యి కూడా ఉండేది. ఇక డిన్నర్ కూడా తేలికపాటి గా ఉండేదట. ఎక్కువగా పెరుగు, బాటిల్ గార్డ్ సూప్ తినేదట.నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందు గానే డిన్నర్ కంప్లీట్ చేసేదట. ఇక అప్పుడప్పుడూ నెయ్యితో వేయించిన గుప్పెడు కాల్చిన మఖానా తీసుకునేదట.

ఇవి కూడా చదవండి

 

సాధారణంగా కొంతమంది బరువు తగ్గేటప్పుడు వేరొకరిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. అయితే ఈ నటి తనకు తానే స్ఫూర్తిగా నిలిచింది. జిమ్ లో వర్కౌట్లు, కఠినమైన ఆహార నియమాలతో ఆరు నెలల్లో ఏకంగా 55 కిలోలు తగ్గింది. గతంలో భారీ బరువుతో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సన్నజాజిలాగా నాజూకుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? తనే షెహనాజ్ గిల్. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోస్ నెట్టింట వైరలవుతన్నాయి.

 

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.