Vetri Duraisamy: స‌ట్లెజ్‌ నదిలో దొరికిన డైరెక్టర్ మృతదేహం.. ముఖ్యమంత్రి సంతాపం!

|

Feb 13, 2024 | 5:32 PM

హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో డైరెక్టర్ వెట్రి ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవ‌రి 4వ తేదీన ప్రమాదానికి గురైంది. సిమ్లా నుంచి స్పితికి వెళ్తుండగా వెట్రి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వెట్రి ప్రయాణిస్తున్న కారు సట్లేజ్‌ నదిలో పడిపోయింది. దీంతో గత 9 రోజుల నుంచి ఆయ‌న ఆచూకీ దొరక లేదు. అదే కారులో డైరెక్టర్ వెట్రితో ప్రయాణిస్తున్న గోపినాథ్ అనే మ‌రో వ్యక్తిని ర‌క్షించగలిగానే. ప్రస్తుతం అత‌ను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కారు డ్రైవ‌ర్ టెంజిన్ కూడా ఈ ప్రమాదంలో మ‌ర‌ణించాడు. అయితే వెట్రి ఆచూకీ మాత్రం దొరకలేదు..

Vetri Duraisamy: స‌ట్లెజ్‌ నదిలో దొరికిన డైరెక్టర్ మృతదేహం.. ముఖ్యమంత్రి సంతాపం!
Director Vetri Duraisamy
Follow us on

షిమ్లా, ఫిబ్రవరి 13: చెన్నై న‌గ‌ర మాజీ మేయ‌ర్ స‌దాయి దురైస్వామి కుమారుడి మృతదేహం లభ్యమైంది. ఫిల్మ్ డైరెక్టర్ అయిన వెట్రి దురైస్వామి (45) కారు 9 రోజుల క్రితం స‌ట్లెజ్‌ న‌దిలో మునిగిపోయింది. అప్పటి నుంచి ఆయ‌న ఆచూకీ దొరకలేదు. ఈ రోజు ఆయన మృతదేహం సట్లేజ్‌ నదిలో గుర్తించారు. అసలేం జరిగిందంటే..

హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో డైరెక్టర్ వెట్రి ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవ‌రి 4వ తేదీన ప్రమాదానికి గురైంది. సిమ్లా నుంచి స్పితికి వెళ్తుండగా వెట్రి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వెట్రి ప్రయాణిస్తున్న కారు సట్లేజ్‌ నదిలో పడిపోయింది. దీంతో గత 9 రోజుల నుంచి ఆయ‌న ఆచూకీ దొరక లేదు. అదే కారులో డైరెక్టర్ వెట్రితో ప్రయాణిస్తున్న గోపినాథ్ అనే మ‌రో వ్యక్తిని ర‌క్షించగలిగానే. ప్రస్తుతం అత‌ను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కారు డ్రైవ‌ర్ టెంజిన్ కూడా ఈ ప్రమాదంలో మ‌ర‌ణించాడు. అయితే వెట్రి ఆచూకీ మాత్రం దొరకలేదు. నాటి నుంచి ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో తన కొడుకు తండ్రి స‌దాయి దొరైస్వామి భారీ రివార్డు ప్రక‌టించారు. వెట్రి ఆన‌వాళ్లను గుర్తించిన‌ వాళ్లకు రూ.కోటి రివార్డు ప్రక‌టించారు.

న‌దిలో ప‌డిన వెట్రి కోసం పలు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) ఉత్తరాఖండ్, జిల్లా పోలీసు అధికారులతో సహా పలు బృందాలు అన్వేషించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో మహిన్ నాగ్ అసోసియేషన్‌కు చెందిన గజ ఈతగాళ్ల బృందం వెట్రి మృతదేహాన్ని సోమవారం గుర్తించింది. షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడిక‌ల్ కాలేజీ (ఐజీసీఎంహెచ్)కి అత‌ని డెడ్‌బాడీని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసు అధికారులు నది ఒడ్డున మానవ మెదడు పదార్థం లాంటిది కనుగొన్నారు. ఇది వెట్రికి చెందిదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి డీఎన్‌ఏ పరీక్ష కోసం పంపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సదాయి దురైసామి కుమారుడి మృతికి సంతాపాన్ని తెలియజేశారు. కాగా వెట్రి దురైస్వామి తమిళంలో ‘ఇంద్రావ‌తు ఒరునాల్’ అనే చిత్రానికి డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.