
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ట్రెండ్ మారింది. కంటెంట్ నచ్చితే చిన్న సినిమాకు సైతం పట్టం కడుతున్నారు అడియన్స్. స్టార్ హీరోహీరోయిన్ ఉన్నా.. లేకపోయినా.. కథ నచ్చితే బ్రహ్మారథం పడుతున్నారు. ఇటీవల బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించి.. ఎలాంటి అంచనాలు..హడావిడి లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్లతో అదరగొట్టాయి. ఇటీవల తెలుగులో వచ్చిన బేబీ సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ చిన్న సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఓ ఆరుగురు అక్కా చెల్లెళ్లు థియేటర్లలో సత్తా చాటుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. దాదాపు రూ.5 కోట్లతో నిర్మించిన ఆ సినిమా మూడు వారాల్లోనే రూ. 60 కోట్లకు చేరువయ్యింది. అదే మరాఠీ చిత్రం బైపన్ భారీ దేవ.
మరాఠీ దర్శకుడు కేదార్ శిందే దర్శకత్వం వహించిన సినిమా బైపర్ భారీ దేవ. ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఓ కారణంతో దూరమవుతారు. మళ్లీ అనుకోకుండా వీరంతా కలవాల్సి వస్తుంది. ఆ తర్వాత వారి మధ్య జరిగిన పరిణామాలే ఈ బైపర్ భారీ దేవ కథాంశం. ఈ సినిమాలో రోహిణి హట్టంగడి, వందన గుప్తే, సుకన్య మానే, శిల్పా నవాల్కర్, సుచిత్ర బండేకర్, దీప పరా ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 30న విడుదలైన ఈ సినిమా పదకొండు రోజుల్లోనే దాదాపూ రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక అందరి అంచనాలను మించి ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్వీట్టర్ వేదికగా షేర్ చేసిన వివరాల ప్రకారం.. బ్లాక్ బస్టర్ హిట్ బైపర్ భారీ దేవ చిత్రం మొదటి రోజు ఒక కోటి రూపాయాలు వసూలు చేసింది. ఆ తర్వాత 3 వారాల్లోనే రూ. 58.59 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. నిన్న ఒక్కరోజు ఈ సినిమా రూ.1.44 కోట్లు రాబట్టింది అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని మాధురీ భోసలే, బేలా షిండే, అజిత్ భూరే సంయుక్తంగా నిర్మించారు.
గతంలో మరాఠీలో తెరకెక్కిన సైరాట్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాదాపు రూ.4 కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపూ రూ.110 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు బైపన్ భారీ దేవ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది.
BLOCKBUSTER RUN CONTINUES… From ₹ 1 cr on *Day 1* to ₹ 58.59 cr in *3 weeks*, #Marathi film #BaipanBhariDeva continues to spell magic at the #BO… [Week 3] Fri 2.40 cr, Sat 5.05 cr, Sun 6.05 cr, Mon 2.15 cr, Tue 2.10 cr, Wed 2.05 cr, Thu 1.44 cr. Total: ₹ 58.59 cr. Nett BOC.… pic.twitter.com/urTt2rQsg4
— taran adarsh (@taran_adarsh) July 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.