MAA Elections 2021: ‘తెర’వెనుక రాజకీయం.. ఇప్పుడే మొదలైన అసలు సిసలు ‘మా’ యుద్ధం

|

Oct 09, 2021 | 3:02 PM

సాధారణ ఎన్నికల్లాగే.. 'మా'లో కూడా ప్రలోభాలు.. క్యాంపులు.. తాయిలాలు నడుస్తున్నాయనే చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది. మరోవైపు సీన్‌లోకి పెద్దలు కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

MAA Elections 2021:  తెరవెనుక రాజకీయం.. ఇప్పుడే మొదలైన అసలు సిసలు మా యుద్ధం
Maa Elections 2021
Follow us on

‘మా’ ఎన్నికల ఎపిసోడ్‌ క్లైమాక్స్‌కి చేరింది. కొన్ని గంటలే మిగిలి ఉంది. మరి సభ్యుల పల్స్ ఎలా ఉంది? ‘మా’ రంగస్థలంలో ఎవరు ఎటువైపు? ‘మా’ రాజ్‌ అంటూ ప్రకాష్ అంటూ జై కొడతారా? లేదంటే మంచు విష్ణుకే మార్కులు వేస్తారా? ఫిలింనగర్‌ సర్కిల్స్‌లోనే కాదూ తెలుగురాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడాలేదు.. అందరూ ‘మా’ ఎన్నికల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. గట్టిగా తిప్పికొడితే వెయ్యిలోపే ఓట్లు. కానీ ఈసారి ఎన్ని ఓట్లు పోలవుతాయి? కనీసం ఐదు వందల ఓట్లయినా పోలవుతాయా? సభ్యులు ఓటింగ్‌కి వచ్చేలా రెండు ప్యానళ్లు శతవిధాలా ప్రయత్నం చేశాయి. ప్రయాణ ఖర్చులు భరిస్తామని హమీల వర్షం కురిపిస్తున్నారు. అయితే అసలు సీన్ వచ్చే సరికి ఎంతమంది అటెండ్‌ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు నిమగ్నమయ్యారు.

సాధారణ ఎన్నికల్లాగే.. ఇక్కడ కూడా ప్రలోభాలు.. క్యాంపులు.. తాయిలాలు నడుస్తున్నాయనే చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది. మరోవైపు సీన్‌లోకి పెద్దలు కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజీ ఫార్ములా వర్కవుట్ అయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు.. కానీ మంతనాలు మాత్రం మించిపోతున్నాయి. అయితే మంతనాల ఫలితాలు ఎవరికి మేలు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. తనయుడు విష్ణుని గెలిపించుకునేందుకు మోహన్‌ బాబు శతివిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఆయన రాసిన లెటర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఏ సమస్య వచ్చినా విష్ణు అండగా ఉంటాడని కాన్ఫిడెంట్‌గా చెబుతూనే ఓటేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేశారాయన. తాజాగా ఆడియో మెసేజ్‌ కూడా విడుదల చేశారు. మరోవైపు మోనార్క్‌ని గెలిపించాలని కంకణం కట్టుకున్న నాగబాబు.. అన్ని విధాలా అర్హుడ్ని గెలిపించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రకాశ్ రాజ్‌కి మంచు విష్ణుకు తెలుగు ఎగ్జామ్ పెడితే.. విష్ణు కనీసం పాస్ కూడా కాలేరంటూ కామెంట్ చేశారు నాగబాబు. అసలు ఆ మాటకొస్తే మద్రాసులో పుట్టిన విష్ణు.. తెలుగు వాడే కాదన్నారు నాగబాబు.

‘మా’ ఎన్నికల ముంగిట్లో నాగబాబు హాట్‌ కామెంట్స్‌ హీట్ పుట్టిస్తున్నాయి. మరోవైపు మా కౌంటింగ్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది. రేపు పోలింగ్‌తో పాటు కౌంటింగ్‌ కూడా జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి 2 గంటలకు వరకు పోలింగ్‌.. మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు కౌంటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ‘మా’ సభ్యుల మధ్య మాటల యుద్ధంతో సిట్యువేషన్ ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన నెలకొంది. దీంతో జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులో ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టారు. ఓటింగ్‌ కోసం వచ్చే వారిని ఎప్పటికప్పుడు పంపిస్తూ.. జనం గుమికూడకుండా ఉండేలా సిబ్బందికి పై అధికారులు ఆదేశాలిచ్చారు.

‘మా’ సంక్షేమం, ‘మా’ బిల్డింగ్‌, ఫండింగ్‌ దుబారా, లోకల్‌ నాన్‌ లోకల్, గెస్ట్‌ లాంటి కామెంట్లు రచ్చ రేపుతున్న వేళ ‘మా’ సభ్యులు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో చాలామంది యంగ్‌ హీరోలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. రి ఈసారైనా వినియోగించుకుంటారా లేదా అన్న చర్చ నడుస్తోంది. ఇక బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం ఓట్ల వేటలో మునిగిపోయారు.

Also Read: హైదరాబాద్‌కు హైఅలెర్ట్.. మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు!