AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: నా ఒంటి మీద చెయ్యేస్తే .. కిందేసి తొక్కుతా..! రెచ్చిపోయిన రమ్యమోక్ష

బిగ్ బాస్ సీజన్ 9 మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే హౌస్ నుంచి కొందరు ఎలిమినేట్ అవ్వడంతో .. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఈ ఆదివారం గ్రాండ్ గా జరిగాయి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు.

Bigg Boss 9 Telugu: నా ఒంటి మీద చెయ్యేస్తే .. కిందేసి తొక్కుతా..! రెచ్చిపోయిన రమ్యమోక్ష
Biggboss9
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2025 | 8:08 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 మరింత ఆసక్తికరంగా మారింది.. కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్. సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కొత్త హౌస్ మేట్స్ హౌస్ లోకి రాగానే రచ్చ మొదలు పెట్టారు’. ఎంట్రీ రోజే నామినేషన్స్ లో హౌస్ మేట్స్ కు వైల్డ్ కార్డు ఎంట్రీలు గట్టి షాక్ ఇచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో దువ్వాడ మాధురి, కళ్యాణ్ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది. అవసరం లేని దానికి కూడా పెద్ద గొడవపెట్టుకొని రచ్చ రచ్చ చేశారు. మాధురి అనవసరంగా కళ్యాణ్ ను రెచ్చగొట్టి రచ్చ చేసింది.

మాధురి మాటలకు కళ్యాణ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు..  మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని అన్నాడు. దాంతో మాధురి కూడా రెచ్చిపోయింది. దాంతో రచ్చ రచ్చ చేశారు. హౌస్ మేట్స్ గొడవను ఆపడానికి ట్రై చేసినా కూడా గొడవ ఆగలేదు. ఆతర్వాత మాధురి, రమ్య కలిసి కళ్యాణ్ పై డిస్కషన్ పెట్టారు.. కళ్యాణ్ పై ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు. రమ్యమోక్ష కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో కామెంట్స్ చేసింది. రమ్య మాట్లాడుతూ.. కళ్యాణ్‌ని అమ్మాయి పిచ్చోడు అంటూ రెచ్చిపోయింది.

అలాగే ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ రోజు శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఆ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేలా ఉంది.. అసలు మాట్లాడట్లేదు.. ముఖం తిప్పుకుంటున్నాడు.. ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లే.. మాట్లాడకపోతే ఎవరికి.. అంటూ రమ్య మాధురి దగ్గర చెప్పుకొచ్చింది. దానికి మాధురి మనం గేమ్ ఆడటానికి వచ్చాము.. ఎవరితోనూ మాట్లాడటానికి కాదు అని మాధురి అంది. చాలా ఇరిటేటింగ్‌గా ఉంది.. మొదటి రోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇలా వేసినప్పుడు.. తనూజ ఎంత ఇరిటేటింగ్‌గా ఉందో తెలుసా.. చూస్తే నాకే ఏదోలా ఉంది.. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా అంతే.. కిందేసి తొక్కేస్తాను.. అంతే అలాగే ఉండాలి.. ఆ అమ్మాయి తనూజ ఎందుకు అలా లీనియెన్స్ ఇస్తుందో కానీ.. డైరెక్ట్‌గా చూపించట్లేదు.. ఇండైరెక్ట్‌గా ఇస్తున్నట్లు అనిపించింది నాకు.. తిడితే తిట్టొచ్చు మనం ఒక్కమాటతో ఆపెయ్యోచ్చు ఆ బిహేవియర్‌ని. గట్టిగా ఒక్క మాట అంటే ఆగిపోతాడు.. కానీ తనూజ అతన్ని ఆపడం లేదు.. చిరాకు వచ్చినప్పుడల్లా.. హేహే అంటుంది అంతే.. ఒకరు మనతో అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా.. అందుకే కదా ఆ బిహేవియర్ వస్తుంది.. రెండు చేతులూ కలిస్తేనా కదా చప్పట్లు అంటూ డైలాగులు వేసింది రమ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అరే ఎలారా.. 18 ఏళ్లకే రూ.64 కోట్లు కాజేసిన కర్రాడు
అరే ఎలారా.. 18 ఏళ్లకే రూ.64 కోట్లు కాజేసిన కర్రాడు
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!