
బిగ్బాస్ (Bigg Boss ) రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు కౌశల్ (Kaushal). ఈ షోలో విజేతగా నిలిచి సక్సెస్ అయిన కౌశల్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం అతడు.. ఆమె.. ప్రియుడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత యండమూరి వీరెంద్రనాథ్ దర్శకత్వం వహించారు. శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో.. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇక నిన్న ఈ సినిమా నుంచి అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్ ను చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్ ను బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే… ఈ డైలాగ్ ట్రైలర్ ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు.
Also Read: Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Kareena Kapoor: తన కొడుకుతో ఓ హీరో సినిమా తీస్తాడని చెప్పిన కరీనా.. ఆ హీరో ఎవరంటే..
Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…