వారాంతం వచ్చేసింది. బిగ్ బాస్(Bigg Boss Season ) స్టేజ్ మీదకు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటిలానే హౌస్ మేట్స్ ను ఉత్సాహపరిచిన నాగ్. ఆతర్వాత వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపించారు. ఒకొక్కరికి క్లాస్ తీసుకున్నారు నాగ్. ఈ క్లాస్ లో అనుకున్నట్టుగానే గీతూని ఓ రేంజ్ లో క్లాస్ పీకారు నాగ్. ఇక బిగ్ బాస్ సీజన్6 మొదలై అప్పడే ఆరు రోజులు అయ్యింది. ఈ ఆరు రోజుల్లోనే హౌస్ లో నానా రచ్చ జరిగింది. గొడవలు, గోలలు, ఏడుపులు, అల్లర్లతో నానా హంగామాగా ఉంది. శనివారం రోజు ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్‌కు ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చాడు. సింగర్ రేవంత్ గురించి మాట్లాడుతూ.. నువ్ ఎంతో చూసి వచ్చావ్.. ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి.. అంటూ కాస్త చురకలు అంటించాడు నాగార్జున.
అలాగే ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడమంటూ చెప్పాడు కింగ్. గ్రౌండ్‌లో ఆటలు ఆడాలి.. ఎంపైర్లు వచ్చి తిరుగుతుంటే ఎలా.? అంటూ నాగ్ సెటైర్లు వేశారు. ఇక గీతూ విషయానికొస్తే.. ఆమె నోటి దురుసు, మాట తీరు, ప్రవర్తన మీద మాట్లాడాడు నాగ్. బాత్రూం విషయంలో నువ్వు చెప్పిన తీరు తప్పు.. పదే పదే ఇంకొకరిని తిక్కదానా? అనడం బాగా లేదు. నువ్ అలా పదే పదే తిక్కల్దానా అని అంటే.. నువ్ తిక్కల్దానివి అని జనాలు అనుకుంటారు అన్నాడు నాగార్జున. దానికి గీతూ మాట్లాడుతూ.. అవును సర్ నాకు కాస్త తిక్క ఉంది అని అంది. అవును నీకు తిక్కుంది కాబట్టి అందరికీ తిక్క ఉందని అనుకుంటున్నావ్.. కానీ నీకు మాత్రమే తిక్క ఉంది.. నువ్ అన్ని మాటలు చెప్పావ్.. కానీ నువ్ వాడిన టిష్యూలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావ్.. మనం చెప్పే మాటలను మనం పాటించాలి.. సంబంధం లేని విషయంలో దూరితే జైల్లో వేస్తారు అని గట్టిగానే చెప్పారు నాగార్జున.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.