
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి అంకానికి చేరుకుంది. సుమారు మూడు నెలల క్రితం (సెప్టెంబర్ 07) ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఈ వారంలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటివరకు ఊహించని ట్విస్టులతో బుల్లితెర ఆడియెన్స్ కు మంచి వినోదం అందించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి ఈ షో ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ఈక్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ట్రోఫీ కోసం ఒకే ఒక్క అడుగుదూరంలో ఉన్నారు టాప్ 5 కంటెస్టెంట్స్. తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన గల్రానీ బిగ బాస్ కప్పు కోసం పోటీ పడుతున్నారు. పేరుకు ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నా టైటిల్ రేసు మాత్రం ప్రధానంగా ఇద్దరి మధ్యే ఉంది. వాళ్లిద్దరే పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 కప్పు అందుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లైన్స్ కూడా ప్రారంభమయ్యాయి. బిగ్ బాస్ తెలుగు అఫీషియల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్‌స్టార్ ద్వారా భారీగా ఓటింగ్ జరుగుతుంది. సాధారణంగా తనూజ నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఆమెదే అగ్రస్థానం. కల్యాణ్ ఉన్నా కూడా చాలావరకూ తనూజనే లీడింగ్‌లో ఉండేది. అయితే గ్రాండ్ ఫినాలేకు వచ్చేసరికి మొత్తం సీన్ రివర్స్ అయ్యిందని తెలుస్తోంది. ఏ ఆన్ లైన్ పోల్ చూసుకున్నా కూడా.. పవన్ కళ్యాణ్ పడాల టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు.
ఓవరాల్ గా తొలిరోజు ఓటింగ్‌లో కళ్యాణ్ పడాలకి ఏకంగా 45 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. అలాగే తనూజకు 27 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. టాప్ -1,2 కంటెస్టెంట్ల మధ్య భారీ ఓటింగ్ వ్యత్యాసం ముంది. అంటే చాలా మంది కల్యాణ్ కే ఓట్లు వేస్తున్నారని తెలుస్తోంది. ఇక వీరికి మరింత దూరంగా ఇమ్మానుయేల్ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. డిమాన్ పవన్ 9 శాతం నాలుగో ప్లేస్ లో కొనసాగుతుండగా, సంజనా 7 శాతం ఓట్లతో ఆఖరి స్థానంలో ఉంది. అయితే ఓటింగ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. కాబట్టి ఏవైనా మార్పులు సంభవించే అవకాశముంది. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కప్పు కల్యాణ్ అందుకోవడం పక్కా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.