అమర్ ఏంటి ఇలా తయారయ్యాడు… అసలు గేమ్ ఏం ఆడుతున్నాడు.. ఆడినా అంతా చీటింగ్, ఫౌల్ గేమ్. ఇది బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకుల మాట. ప్రేక్షకులు మాత్రమే కాదు.. వైల్డ్ కార్డు ఎంట్రీలుగా లోపలకి వెళ్లిన అమర్ ఫ్రెండ్స్ అర్జున్, పూజా, నయని వెర్షన్ కూడా ఇదే. బయట నుంచి వచ్చినవాళ్లు కూడా తన తప్పులు ఎత్తి చూపడంతో అమర్ దీప్ రియలైజ్ అయ్యాడు. పూర్తిగా సైలెంట్ అయ్యాడు. అనవరస కామెంట్స్ చేయడం లేదు. శివాజీని టిప్స్ అడుగుతున్నాడు. ఫౌల్ గేమ్స్ ఆడటం కూడా మానేశాడు. మొత్తం మీద అమర్ ప్రవర్తన మారినట్లే అనిపిస్తుంది. వాస్తవానికి సీరియల్ హీరోగా అమర్‌కు బయట విపరీతమైన పాపులారిటీ ఉంది. అందుకే ఇన్ని వీక్స్ గేమ్ సరిగ్గా ఆడకపోయినప్పటికీ నెట్టుకుని వచ్చాడు. అమర్ చుట్టూ నెగిటివిటీ ఉందని ఇంట్లో ఎవరూ అతడ్ని సరిగ్గా ట్రీట్ చేయడం లేదు. అతని ఫ్రెండ్స్ అయిన శోభా, పూజా, నయని, అర్జున్.. వీరంతా అవౌడ్ చేస్తున్నారు. దీంతో అమర్ బాగా లో అవుతున్నాడు.
అమర్‌కి ఒక్క సందర్భం కలిసి రావాలి. తన నిజాయితీని నిరూపించుకోవాలి. ఇప్పటికే అందరూ నామినేట్ చేస్తున్నారన్న సింపతీ ఉంది. ఒక్క గేమ్ మంచిగా ఆడితే.. ఒక్కసారి లాజిక్ ప్రకారం వాదిస్తే.. జనాలు కూడా జై కొడతారు. వాస్తవానికి అమర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఎదిటివాళ్లను హర్ట్ చేయాలని ఉండదు. కేవలం నోటి దూల వల్ల.. ఇరుక్కుంటూ ఉంటాడు. టాస్కుల రూల్స్ అర్థం చేసుకోకుండా.. లాజిక్ లేకుండా వాదించి.. నవ్వుల పాలు అవుతాడు. ఇప్పుడు సైలెంట్ అయ్యాడు కాబట్టి.. కొంతమేర బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది.
అమర్ ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే.. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ చాలామంది వీక్ ఉన్నారు. అశ్విని, భోళే లాంటి వాళ్లు అమర్‌ను దాటి ముందుకు రాలేదు. పూజా మూర్తి, నయని సైతం అమర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నవాళ్లు కాదు. సో.. అమర్ బ్యాక్ ఆన్ ట్రాక్ అయ్యేందుకు సమయం కూడా ఉంది. తన తప్పులును తెలుసుకుని.. గేమ్ మార్చుకుని.. ముందుకు సాగితే.. అతనికి ఇప్పటికీ టాప్ -5 లో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.