Bigg Boss : మాకేందిరా ఈ రచ్చ.. బిగ్‌బాస్‌ డార్క్ రూమ్‌లో కంటెస్టెంట్ల ముద్దులాట.. వైరలవుతున్న వీడియో..

‏బుల్లితెరపై అతిపెద్ రియాల్టీ షో అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు మంచ రెస్పాన్స్ వస్తుంది. ఓవైపు విమర్శలు, నెగిటివిటీ ఉన్నప్పటికీ ఈ షో చూసే అడియన్స్ సంఖ్య తగ్గడం లేదు. ఇప్పుడు తెలుగులో ఈ షో ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది.

Bigg Boss : మాకేందిరా ఈ రచ్చ.. బిగ్‌బాస్‌ డార్క్ రూమ్‌లో కంటెస్టెంట్ల ముద్దులాట.. వైరలవుతున్న వీడియో..
Bigg Boss (6)

Updated on: Dec 14, 2025 | 11:36 AM

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో గ్రాండ్ ఫినాలే సమయం దగ్గరపడింది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ పేర్లు అధికంగా వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురు టైటిల్ రేసులో పోటా పోటీగా దూసుకుపోతున్నారు. ఇదెలా ఉంటే.. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ ఈ షోకు మంచి రెస్పా్న్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ షో చుట్టూ నెగిటివిటీ సైతం ఎక్కువగానే ఉంది. అన్ని భాషలలోనూ బిగ్ బాస్ షోపై ఎప్పుడు ఏదోక వివాదం నడుస్తుంటుంది. తాజాగా ఈ షో మరోమారు వివాదంలో చిక్కకుంది. అయితే తెలుగు కాదండి.. తమిళ బిగ్ బాస్ తాజా సీజన్లో కంటెస్టెంట్స్ హద్దులు మీరి ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన పార్వతి, కమ్రుద్దీన్ ఇద్దరూ డార్క్ రూంలో ముద్దుల్లో మునిగి తేలడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోలో భాగంగా వీరిద్దరూ ఓ డార్క్ రూంలోకి వెళ్లారు. అక్కడు సుమారు గంటపాటు ఏకాంతంగా గడిపారు. ఈ సమయంలో వారు ముద్దుల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. కెమెరాల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా నమోదు కాకపోయినా.. వారు ధరించిన మైకుల్లో శబ్దాలు స్పష్టంగా వినిపించాయని అడియన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం తెగ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఇదెలా ఉంటే.. సీజన్ ప్రారంభం నుంచి పార్వతి, కమ్రుద్దీన్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జరుగుతుంది. కుటుంబమంతా కలిసి చూసే షోలో ఇలాంటి అసభ్యకరమైన పనులకు పాల్పడటం సరికాదని నెటిజన్స్ మండిపడుతున్నారు. షో నిర్వాహకులపై, కంటెస్టెంట్స్ పై విమర్శలు గుప్పి్స్తున్నారు. పార్వతి, కమ్రుద్దీన్ ఇద్దరు డార్క్ రూమ్ లో ఉన్న గంట తర్వాత బిగ్ బాస్ ఆదేశాలతో వారు డార్క్ రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..