Bigg Boss Bindu Madhavi: డ్రెస్సింగ్ పై కామెంట్ చేసిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బింధుమాధవి..

|

Aug 03, 2022 | 7:53 AM

బిగ్‏బాస్ లో ఉన్నప్పుడు తన ఆటతీరు.. ఆటిట్యూడ్‏తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది బింధమాధవి. అబ్బాయిలకు ధీటుగా పోటీనిచ్చి బిగ్ బాస్ టైటిల్ కైవసం చేసుకుంది.

Bigg Boss Bindu Madhavi: డ్రెస్సింగ్ పై కామెంట్ చేసిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బింధుమాధవి..
Bindumadhavi
Follow us on

సోషల్ మీడియా వచ్చకా సెలబ్రెటీలతో అభిమానులకు దూరం తగ్గింది. నటీనటులు నెట్టింట తమ అభిమానులతో ముచ్చటిస్తూ… వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఫాలోవర్ల నుంచి నెగిటివ్ కామెంట్స్.. ట్రోల్స్ సైతం ఎదుర్కొంటారు. సెలబ్రెటీలు షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ పై కొందరు పాజిటివ్‏గా స్పందిస్తే.. మరికొందరు ట్రోల్ చేస్తుంటారు. నెటిజన్స్ చేసే ప్రతి కామెంట్స్, ట్రోలింగ్‏ను చూసి చూడనట్లు వదిలేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కామెంట్ చేసినవారికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోహీరోయిన్స్ ఇలాంటి ట్రోలింగ్ భారిన పడిన వారే. తాజాగా హీరోయిన్ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బింధుమాధవి (Bindu Madhavi) నెట్టింట చెదు అనుభవం ఎదురైంది. ఆమె డ్రెస్సింగ్ వల్ల గౌరవం పోయిందంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‏కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది బింధుమాధవి.

అసలు విషయానికి వస్తే.. బిగ్‏బాస్ లో ఉన్నప్పుడు తన ఆటతీరు.. ఆటిట్యూడ్‏తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది బింధమాధవి. అబ్బాయిలకు ధీటుగా పోటీనిచ్చి బిగ్ బాస్ టైటిల్ కైవసం చేసుకుంది. అయితే బిగ్ బాస్ లో బింధుమాధవి పాల్గొన్నప్పుడు ఆమె అంటే నాకు గౌరవం ఉండేది. ఎందుకంటే ఇతర కంటెస్టెంట్స్ అందరూ తమ బాడీని ఎక్స్ పోజ్ చేస్తుండేవారు. ఆమె మాత్రం చక్కగా డ్రెస్ వేసుకుంది. కానీ ఇప్పుడా ఆ గౌరవం పోయిందంటూ ఓ నెటిజన్ బింధుమాధవిని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ఇది చూసిన బింధు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఓ వ్యక్తికి ఇచ్చే వేసుకునే దుస్తుల కారణంగా ఉంటే అలాంటి గౌరవం నాకు వద్దంటూ రిప్లై ఇచ్చింది. సోషల్ మీడియాలో బింధుమాధవికి మద్దతునిస్తున్నారు నెటిజన్స్. వేసుకునే దుస్తులను బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.