Inaya Sultana: ”ఆ హీరోయిన్స్‌లా చేసుంటే నేను ఇప్పుడు స్టార్ అయ్యేదాన్ని”.. ఇనాయ సుల్తానా కామెంట్స్

హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇనాయ సుల్తానా. కానీ ఈ ఆముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రాలేదు. దాంతో మూవీ ఇంటర్వ్యూలతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో క్రేజ్ తెచ్చుకుంది. రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ ఆ తర్వాత ఆయనతో ఓ పార్టీలో డాన్స్ చేయడంతో ఈ భామ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Inaya Sultana: ఆ హీరోయిన్స్‌లా చేసుంటే నేను ఇప్పుడు స్టార్ అయ్యేదాన్ని.. ఇనాయ సుల్తానా కామెంట్స్
Inaya Sultana

Updated on: Nov 10, 2023 | 5:15 PM

బిగ్ బాస్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఇనాయ సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని సందడి చేసింది ఈ బ్యూటీ. తనదైన గేమ్ స్ట్రాటజీతోపాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇనాయ సుల్తానా. కానీ ఈ ఆముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రాలేదు. దాంతో మూవీ ఇంటర్వ్యూలతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో క్రేజ్ తెచ్చుకుంది. రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ ఆ తర్వాత ఆయనతో ఓ పార్టీలో డాన్స్ చేయడంతో ఈ భామ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అలాగే ఆర్జీవితో చేసిన డాన్స్ వైరల్ అవ్వడమతొ అసలు ఎవరు ఈ ఇనాయ సుల్తానా అంటూ నెటిజన్స్ తెగ వెతికేశారు.

ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. లాస్ట్ సీజన్ లో తన గేమ్ తో అందరిని ఆకట్టుకుంది ఇనాయ. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఛాన్స్ లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో సోషల్ మీడియాకే పరిమితం అయ్యిపోయింది ఇనాయ.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఇనాయ సుల్తానా. తాజాగా ఈ అమ్మడు శ్రీలీల, కృతి శెట్టి పై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వారిలా చేసుకుంటే నేను ఇప్పుడు హీరోయిన్ గా రాణించే దాన్ని అని చెప్పుకొచ్చింది. శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ ఇద్దరు భామలు 17 ఏళ్ల వయసులోనే ఇండస్టీలోకి వచ్చి ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కానీ తాను మాత్రం 22 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను అని తెలిపింది ఇనాయ. దాదాపు ఏడేళ్లు వెస్ట్ చేశాను లేకుంటే నేను కూడా వల్ల లా మంచి పొజిషన్ లో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది .

ఇనాయ సుల్తానా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.