
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆర్జే శేఖర్ బాషా. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యాడు. చాలా కాలంగా పలు యూట్యూబ్ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా మాట్లాడుతూ.. దివంగత నటి ప్రత్యూష మరణం చుట్టూ అలుముకున్న వివాదాలు, ఆమెతో తనకున్న అరుదైన అనుబంధం, న్యాయపోరాటంపై కీలక విషయాలు వెల్లడించారు. తేజ దర్శకత్వంలో రూపొందిన జయం సినిమా తొలి వెర్షన్‌లో తాను కథానాయకుడిగా, ప్రత్యూష కథానాయికగా ఎంపికయ్యారని అన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఆడిషన్స్‌కు వెళ్లిన ఆయన, రామానాయుడు వంటి ప్రముఖుల సమక్షంలో జరిగిన ఎంపిక ప్రక్రియలో వందలాది మంది నుంచి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రత్యూషతో కలిసి కొన్ని డైలాగులు, సీన్లు ప్రాక్టీస్ చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఎత్తు, తన ఎత్తు సరిపోలడం, వారి మధ్య కెమిస్ట్రీని పరిశీలించిన తర్వాత తమను జంటగా ఎంపిక చేశారని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
ప్రత్యూషను చాలా ఆత్మవిశ్వాసం గల మహిళ అని అన్నారు.. కెమెరా ముందు ఆమె ప్రొఫెషనల్‌గా, ఎంతో ధైర్యంగా కనిపించేవారని, కళ్లలో కళ్లు పెట్టి చూసే షాట్‌లలోనూ ఆమె ఏమాత్రం బెరుకు లేకుండా నటించేవారని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దై, తర్వాత నితిన్‌తో జయం సినిమా తెరకెక్కిందని పేర్కొన్నారు. కొన్నాళ్లకు ప్రత్యూష మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
ప్రత్యూష కేసు విషయానికి వస్తే, ఆమె మరణంపై అత్యాచారం, హత్య, ప్రేమ ఆత్మహత్య వంటి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయని శేఖర్ బాషా ప్రస్తావించారు. సిద్ధార్థ రెడ్డితో ఆమెకు ప్రేమాయణం నడిచిందని, అయితే సిద్ధార్థ రెడ్డి కుటుంబం నుంచి ప్రతిఘటన ఎదురైందని, సినిమా రంగానికి చెందిన అమ్మాయిని కోడలిగా స్వీకరించడానికి వారు ఇష్టపడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిడి వల్లే ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగిందని అన్నారు. ప్రేమించిన వ్యక్తి అత్యాచారం చేస్తాడని తాను నమ్మలేదని, ప్రత్యూష అంత అమాయకురాలిగా కనిపించినా, “నో” అని గట్టిగా చెప్పగల ఆత్మవిశ్వాసం ఆమెకుందని శేఖర్ బాషా చెప్పారు. ఈ కేసులో 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష, 40,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
Pratyusha, Shekar Basha
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..