
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో బుజ్జిగాడు ఒకటి. ఈ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సంజన గల్రానీ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది. చాలా కాలం తర్వాత ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేసింది. తన ఆట తీరుతో టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచింది. ఈ షో తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజన.. తాజాగా తన పర్సనల్, కెరీర్ లైఫ్ పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ప్రజల నుంచి అపారమైన ప్రేమ, ఆదరణ లభిస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ ఇంట్లో మూడున్నర నెలలు గడపడం తన జీవితంలో ఒక ప్రత్యేక అనుభవమని తెలిపారు. తాను హోమ్ సిక్ వల్ల కేవలం 10-20% శక్తిని మాత్రమే పెట్టినప్పటికీ, హౌస్‌ని గడగడలాడించానని చెప్పారు. ఆమె గట్సీ నేచర్, ఎంత మంది విరుచుకు పడినా కూల్‌గా, నవ్వుతూ సమాధానం చెప్పే పద్ధతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తాను బయటి ప్రపంచంతో సర్దుకుపోవడానికి, పిల్లలతో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నానని, తన షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పారు.
తాను పని చేసిన హీరోలతో అనుబంధంపై మాట్లాడుతూ..
ప్రభాస్: బుజ్జిగాడు సినిమాలో తనను బావగారు అని పిలిచే సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఎంతోమంది అమ్మాయిల హృదయాలు బ్రద్దలవుతాయని సరదాగా అన్నారు. ప్రభాస్ చాలా ఇంట్రోవర్ట్ అని, ఈవెంట్లకు అరుదుగా వస్తారని, తన షెల్‌లోనే ఉంటారని చెప్పారు.
విరాట్ కోహ్లీ: బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీతో తన పాత ఫోటో వైరల్ అవ్వడం గురించి మాట్లాడారు. RCB కొత్తగా ఉన్నప్పుడు తాను ఒక బెంగళూరు నటిగా అతిథిగా వెళ్ళానని, ఆ సమయంలో విరాట్‌తో స్నేహం మాత్రమే ఉండేదని వివరించారు. మీడియాలో వచ్చిన అనవసరమైన వదంతులు తమ నిజమైన స్నేహాన్ని నాశనం చేశాయని, తనకు ఆ తరహా పబ్లిసిటీ అవసరం లేదని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్‌తో పనిచేసిన అనుభవం అద్భుతమని సంజన భావోద్వేగంగా పంచుకున్నారు. ఆయన వ్యక్తిత్వం, స్త్రీల పట్ల ఆయన చూపే గౌరవం, సెమీ-డైరెక్టర్‌గా ఆయన ఇచ్చే సూచనలు తనను ఆకట్టుకున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖం మీద ఒక ప్రత్యేకమైన ఆకర్షణ (ఛార్మ్) ఉంటుందని, ఆయన ఆరా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, సెట్‌లో అందరూ ఆయన్నే చూస్తూ ఉంటారని తెలిపారు. తన నంబర్ వన్ మోస్ట్ ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నారు.
నాగార్జున: నాగార్జున గారిని తన జీవితానికి ఒక మెంటార్‌గా, తండ్రిలా భావిస్తానని సంజన అన్నారు. ఆయన అద్భుతమైన ఓర్పుతో, ఎవరిని బాధపెట్టకుండా కరెక్షన్స్ చెప్పే విధానం నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు. ఒక జెంటిల్‌మెన్‌గా ఆయన సమస్యలను పరిష్కరించే పద్ధతిని తాను అనుసరించడం మొదలుపెట్టానని తెలిపారు. ప్రతి వారం నాగార్జున సర్‌ని కలవాలనే ఆనందమే బిగ్ బాస్ ఇంట్లో తన బాధలను మర్చిపోయేలా చేసిందని, ఆయన తిట్టినా బాధపడలేదని, అది ఒక ప్రేమతో కూడిన మందలింపుగా భావించానని వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Sanjana Galrani
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..