Mehaboob Dilse: బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ ఇంట పెళ్లి బాజాలు.. నెట్టింట ఫొటోస్ వైరల్

బిగ్‌బాస్‌లోకి వెళ్లి వచ్చాకే మెహబూబ్‌ దశ తిరిగింది. ఈ రియాల్టి షో తర్వాతనే సొంతింటికల సాకారం చేసుకున్నాడు. అలాగే లగ్జరీ కారును కూడా కొనుగోలు చేశాడు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు మెహబూబ్‌. అతనికి ఒక సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది.

Mehaboob Dilse: బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ ఇంట పెళ్లి బాజాలు.. నెట్టింట ఫొటోస్ వైరల్
Mehaboob Dilse

Updated on: Jul 08, 2023 | 4:35 PM

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెహబూబ్‌ దిల్‌ సే. అంతకుముందు టిక్‌ టాక్‌ వీడియోలతో బాగా ఫేమస్‌ అయ్యాడు. అలాగే యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌, మ్యూజిక్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అయితే బిగ్‌బాస్‌లోకి వెళ్లి వచ్చాకే మెహబూబ్‌ దశ తిరిగింది. ఈ రియాల్టి షో తర్వాతనే సొంతింటికల సాకారం చేసుకున్నాడు. అలాగే లగ్జరీ కారును కూడా కొనుగోలు చేశాడు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు మెహబూబ్‌. అతనికి ఒక సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. అందులో తనకు సంబంధించిన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ విషయాలను షేర్‌ చేసుకుంటుంటాడు. తాజాగా మెహబూబ్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతని తమ్ముడు సుభాన్‌ షైఖ్‌ వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈక్రమంలో తన తమ్ముడి నిఖా ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌. తన తమ్ముడితో కలిసిఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ..

‘నిఖా ముబారక్‌ మేరా భాయ్‌.. డియర్‌ బ్రదర్‌.. నీ కలలు సాకారం కావాలి. ఆ అల్లాహ్‌ మీ ఇద్దరినీ ఎప్పటికీ కలిపి ఉంచాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరికొకరు తోడుగా ఉండండి. ఎప్పుడూ సహనం, ఓర్పుతో మెదలండి. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’ అని తన సోదరుడికి వెడ్డింగ్ విషెస్‌ చెప్పాడు మెహబూబ్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు మెహబూబ్‌ తమ్ముడికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.