
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. ఎవరు టాప్ 5లో నిలుస్తారు. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో అదరగొట్టి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. అలాగే మిగిలిన వారు కూడా తమ శక్తి మేర ఆడి ప్రేక్షకులను మెప్పించారు. 13వ వారంలో ఎలిమినేషన్ లో ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానుందని తెలుస్తుంది. మొదటి నుంచి హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఓ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానుందని తెలుస్తుంది.
ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది ఆమె ఎవరో కాదు రీతూ చౌదరి. ఇప్పుడు ఈ అమ్మడు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వనుందని తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ ఆరుగురిలో సంజన లేదా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రీతూ ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానుందని తెలుస్తుంది.
హౌస్ లో డీమన్ పవన్ తో రాసుకుపూసుకు తిరుగుతూ కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది రీతూ చౌదరి. ఇక ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అవ్వనుందని తెలుస్తుంది. నిజానికి ఓటింగ్ లో రీతూకి బాగానే ప్రేక్షకులు సపోర్ట్ చేశారు.. కానీ ఎక్కడో తేడా కొట్టి ఆమె ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. మొదటి నుంచి రీతూని బిగ్ బాస్ బాగానే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. గేమ్ కంటే లవ్ ట్రాక్ ఎక్కువ నడుపుతున్నా కూడా ఆమెకు సపోర్ట్ చేశాడు బిగ్ బాస్. కానీ గత కొన్నిరోజుల నుంచి ఆమె గేమ్ కంటే గొడవలు ఎక్కువ పడుతుంది. చిన్నవాటికి కూడా ఏడవడం.. కాస్త ఓవర్ అనిపించింది.. దాంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానుందని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .