సారీ సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా..! రాము సెల్ఫ్ ఎలిమినేషన్.. 9 వారాలకు ఎంత సంపాదించాడంటే

బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. వారాంతం వస్తే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీతో అదరగొడుతున్నారు. శనివారం హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ తీసుకునే నాగార్జున ఆదివారం హౌస్ మేట్స్ తో ఆటలాడించి, పాటలు పాడించి ఒకరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చేస్తారు..

సారీ సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా..! రాము సెల్ఫ్ ఎలిమినేషన్.. 9 వారాలకు ఎంత సంపాదించాడంటే
Ramu Rathod

Updated on: Nov 09, 2025 | 10:14 AM

బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. హౌస్ నుంచి ఇప్పటికే చాలా మంది ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక గతవారం హౌస్ నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. ఇక ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో ఊహించని సంఘటన జరిగింది.. హౌస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. హౌస్ లో ఉండలేకపోతున్నా.. ఒంటరిగా ఫీల్ అవుతున్నా అని ఎమోషనల్ అయ్యాడు రాము రాథోడ్. నాగార్జున ఎంత బ్రతిమిలాడినా కూడా.. నేను ఉండలేనంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు రాము రాథోడ్. అయితే వెళ్తూ వెళ్తూ పాట పాడి అందరూ ఎమోషనల్ అయ్యేలా చేశాడు రాము రాథోడ్.

బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

నాగార్జున రామును హౌస్ లో ఉంచడానికి చాలా ప్రయత్నించాడు. అయినా కూడా రాము వినలేదు.. ఉండలేను సార్.. మా అమ్మ, నాన్న గుర్తొస్తున్నారు సార్ అంటూ ఎమోషనల్ అయ్యాడు రాము రాథోడ్. రాముని కన్వెన్స్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించారు నాగార్జున. అయితే రాము ఎంత చెప్పినా కూడా వెళ్తానని తీవ్ర భావోద్వోగానికి గురయ్యాడు. ఇంటిని బాగా మిస్ అవుతున్నావా? ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటున్నావా? అని అడిగారు నాగార్జున. అవును సార్.. వెళ్లిపోదాం అనుకుంటున్నా అని రాము ఆన్సర్ ఇచ్చారు.

7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..

ఇప్పుడే వెళ్ళిపోతావా.? అని నాగ్ అడగ్గా.. వెళ్తా సార్.. ఇప్పుడు వెళ్లమంటే ఇప్పుడే వెళ్లిపోతా.. అని చెప్పాడు రాము. సార్.. మాటకంటే కూడా నాకు పాటే ఇష్టం. నా మాటల్లో చెప్పాలనుకున్న భావాన్ని పాటలో చెప్తాను. ఓ నాలుగు లైన్‌లు పాడి వినిపిస్తాను అని చెప్పాడు రాము. పాడు రామూ.. పాడు.. మేమంతా వెయిట్ చేస్తున్నాం.. అని అన్నారు నాగ్. దాంతో తిన్నాతీరంబడుతలే.. కూర్చొన్నా తీరంబడుతలే.. ఏడున్నా తీరంబడుతలే.. అంటూ ఎమోషనల్ గా పాట పాడి వినిపించాడు రాము. దాంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. ఆతరువాత రామును హౌస్ నుంచి బయటకు పంపారు. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కూడా రాము పెద్దగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఇక రాము రాథోడ్‌ ఒక వారానికి రెమ్యునరేషన్‌గా రూ. 2లక్షల వరకు తీసుకున్నట్లు టాక్‌ ఉంది.. మొత్తంగా రాము 9 వారాలు హౌస్ లో ఉన్నాడు. దాంతో మొత్తంగా రూ. 18 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.