
బిగ్ బాస్ గేమ్ షోలో గొడవలకు , అరుపులకు ఏడుపులకు కొదవే లేదు. టీఆర్పీ డౌన్ అవుతుంది అనుకుంటే చాలు హౌస్ లో ఎదో ఒక గొడవ మొదలవుతుంది.. ప్రేక్షకులు ఇది కదా మాకు కావాల్సింది అనేలా ఎదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారు హౌస్ మేట్స్.. ఇక ఇప్పుడు సంజన వంతు వచ్చింది. టీఆర్పీని అమాంతం లేపాలనుకుందో.. లేక అందరిలో మరోసారి హైలైట్ అవ్వాలనుకుందో ఏమో కానీ రీతూ పై నోరుపారేసుకుంది సంజన. దాంతో హౌస్ మొత్తం రచ్చ రచ్చ జరిగింది. డిమాన్ పవన్, రీతూ చౌదరి మధ్య ఉన్న రిలేషన్ పై నోరు జారింది. రాత్రి అయితే రీతూ పవన్ కలిసి కూర్చుంటున్నారు. అది నేను చూడలేకపోతున్నా అంటూ సంజన చెప్పుకొచ్చింది. దాంతో రీతూ మైండ్ బ్లాక్ అయ్యింది. సంజన కామెంట్స్ పై హౌస్ మొత్తమ్ షాక్ అయ్యింది. అమ్మ అమ్మని పిలిచే ఇమ్మాన్యుయేల్ కూడా సంజన పై సీరియస్ అయ్యాడు. సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఇమ్మానుయేల్ ఫైర్ అయ్యాడు.
నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్‌లో భాగంగా కెప్టెన్ అయిన రీతూ చౌదరి సంజనను నామినేట్ చేసింది. అలాగే తన నామినేషన్ పాయింట్ చెప్పింది. రీతూ తన పాయింట్ చెప్పగానే ఢిఫెన్ చేసుకునే క్రమంలో సంజన గీత దాటింది. నేను నీ అంత పెద్ద పెద్ద బూతులు కూడా వాడలేదు ఈ ఇంట్లో.. అని సంజన రీతూపై నోరుపారేసుకుంది. రీతూ కూడా గట్టిగానే ఇచ్చి పడేసింది. కానీ ఊహించని విధంగా ఆ టాపిక్ మార్చేసి.. నీలాంటి స్ట్రాటజీలు కూడా ఈ హౌస్‌లో ఎవరికీ లేవు రీతూ.. డీమాన్‌తో కూర్చుంటావ్ నువ్వు రాత్రి ఓకే.. కళ్లు మూసుకోవాల్సి వస్తుంది నేను అని సంజన అనేసింది. ఆ మాట వినగానే రీతూ ఎమోషనల్ అయింది. ఆ మాట కరెక్ట్ కాదు వెనక్కి తీసుకోండి.. ఆ మాట కరెక్ట్ కాదు.. తను ఆడపిల్లే ఆ మాట అనకూడదు.. అని ఇమ్మాన్యుయేల్ కూడా సంజన పై సీరియస్ అయ్యాడు.
తను అలా అంటుకొని కూర్చుంటే నాకు చూడటానికి కంఫర్ట్‌గా లేదు.. అంటూ దివ్య దగ్గరికెళ్లి డీమాన్‌తో రీతూ ఎలా ఉంటుందో పట్టుకొని చూపించింది సంజన. సంజన ఎంత సేపటికి ఆగకపోవడంతో.. తనూజ-దివ్య ఆమెను పక్కకు తీసుకెళ్లి మీరు చెప్తుంది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ఆగలేదు. అలాగే మీరు కరెక్ట్ మాట్లాడలేదు.. నేను చెప్తున్నా మీరు కరెక్ట్ మాట్లాడలేదు.. అంతే మీరు ఏదైనా అనుకోండి.. మీరు మాట్లాడింది నాకు నచ్చలేదు.. అంటూ సంజనపై ఇమ్మూ ఫైర్ అయ్యాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి