AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : బిగ్‏బాస్ షో మొత్తం స్క్రిప్ట్.. నిజాలు బయటపెట్టిన శ్రీజ దమ్ము.. వీడియో వైరల్..

బిగ్ బాస్ సీజన్ 9.. ఈసారి చదరంగం కాదు. రణరంగం అంటూ మొదటి నుంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు హోస్ట్ నాగార్జున. అలాగే గత సీజన్లకు భిన్నంగా ఈసారి అగ్నిపరీక్ష అంటూ కామనర్స్ ను తీసుకొచ్చి గేమ్ ఆడించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9న ముగింపు దశకు చేరుకుంది.

Bigg Boss 9 Telugu : బిగ్‏బాస్ షో మొత్తం స్క్రిప్ట్.. నిజాలు బయటపెట్టిన శ్రీజ దమ్ము.. వీడియో వైరల్..
Dammu Sreeja
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2025 | 1:59 PM

Share

బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఎనిమిది సీజన్స్ కంప్లీట్ కాగా.. ఇప్పుడు 9వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ పూర్తి కానుంది. ప్రస్తుతం పదకొండవ వారం నడుస్తుండగా.. ఫ్యామిలీ వీక్ ఒక్కసారిగా బిగ్ బాస్ ఆటను మార్చేసింది. ముందు నుంచి బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ నెటిజన్స్ పిలుస్తున్న తనూజనే విన్నర్ అనే టాక్. కానీ ఫ్యామిలీ వీక్ అనంతరం.. అనుహ్యంగా విన్నర్ రేసులోకి దూసుకొచ్చాడు కళ్యాణ్ పడాల. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రేసులో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ దూసుకుపోతున్నారు. అలాగే ఈ వారం దివ్య బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

ఇదెలా ఉంటే.. ఈ సీజన్ లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న దమ్ము శ్రీజ తాజాగా మరో షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. నిజానికి ఈ సీజన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటే దమ్ము శ్రీజదే. అలాగే రీఎంట్రీ పేరుతో మరోసారి హౌస్ లోకి తీసుకువచ్చి.. మళ్లీ ఎలిమినేట్ చేశారు. అయితే రెండుసార్లు శ్రీజకు జర్నీ వీడియో ప్లే చేయలేదు. మరోవైపు తన ఎలిమినేషన్ పై ఇప్పటికే సంచలన కామెంట్స్ చేసింది శ్రీజ. ఈ షో గురించి చెబుతూ నిజాలను బయటపెడుతూ రోజుకో వీడియో షేర్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

వీడియోలో శ్రీజ మాట్లాడుతూ.. “హౌస్ లోకి వెళ్లిన తర్వాత వాళ్లకు వీళ్లు సపోర్ట్ చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. ఫైనల్ గా అక్కడ సపోర్ట్ వేరే వాళ్లకు చేస్తారు. జనాలు మాత్రం వేరేలా అనుకుంటారు. కానీ అక్కడ జరిగేదంతా వేరే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మాకు స్క్రిప్ట్ ప్రకారమే అంత చేయమని చెప్తారు. వాళ్లు ఎలా చెప్తే మేమే అలా చేస్తాము. అంతే తప్ప మరొకటి మా చేతుల్లో లేదు ” అంటూ అన్ని నిజాలు బయటపెట్టింది శ్రీజ. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Follow Us
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..