Bigg Boss 9: పాపమ్ రీతూ.. అందరు కలిసి టార్గెట్.. చేసిందేమి లేక కన్నీళ్లు

బిగ్ బాస్ తెలుగు సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 13 వారం ఎండింగ్ కు చేరుకున్న ఈ రియాలిటీ షోకు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టాప్ -5 కంటెస్టెంట్స్ ఎవరు? రన్నర్ ఎవరు? కప్పు ఎవర కొట్టునున్నారు? అన్న విషయాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.

Bigg Boss 9: పాపమ్ రీతూ.. అందరు కలిసి టార్గెట్.. చేసిందేమి లేక కన్నీళ్లు
Bigg Boss9

Updated on: Dec 05, 2025 | 8:37 PM

బిగ్ బాస్ లాస్ట్ స్టేజ్ కు వచ్చేసింది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోనుంది.  దాంతో ఫైనలిస్ట్ అవ్వడానికి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడని న్యూస్ వస్తుంది.  తాజాగా బిగ్ బాస్ నుంచి విడుదలైన ప్రోమోలో రీతూ చౌదరి, కళ్యాణ్ , ఇమ్మాన్యుయేల్ కు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కట్టు నిలబెట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రేస్ లో ఉన్న ముగ్గురు పాల్గొన్నారు. రీతూ, కళ్యాణ్, ఇమ్మాన్యూల్ ముగ్గురూ బ్రిక్స్ తో టవర్స్ నిర్మించారు. మిగిలిన కంటెస్టెంట్స్‌ బాల్స్‌తో ఆ టవర్ ను కూల్చడానికి దాడి చేస్తుంటారు. పోటీదారులు బ్యాట్స్ సహాయంతో ఆ బాల్స్ ను ఆపే ప్రయత్నం చేస్తుంటారు.

గత సీజన్ లో ఇదే టాస్క్ లో అమర్ దీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రేయ్.. వద్దురా.. ప్లీజ్ అంటూ వేడుకున్నాడు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి రీతూ చౌదరి వద్దురా.. ప్లీజ్ అంటూ హౌస్ మేట్స్ ను వేడుకుంది. ముందుగా ఈ టాస్క్ లో తనూజ, భరణి రీతూని టార్గెట్ చేశారు. దాంతో రీతూ ఇద్దరు కలిసి ఒక్క దాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ వేడుకుంది. ఈ టాస్క్‌కి సంజన సంచాలక్‌గా వ్యవహరించింది.

ఇక రీతూకి సపోర్ట్ గా డీమన్ పవన్ ఒక్కడే నిలిచాడు. కళ్యాణ్  టవర్ కూల్చడానికి బాల్స్ విసిరాడు. కానీ మనోడు విసిరిన బాల్స్ ఒక్కటి కూడా కళ్యాణ్ టవర్ ను టచ్ చేయలేదు. ఇక కళ్యాణ్‌ని ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్లని టార్గెట్ చేస్తా.. అని తనూజ చెప్పి రీతూ టవర్ కు బాల్స్ విసిరింది. దాంతో రీతూ టవర్ పడిపోవడం మొదలైంది. తనూజతో పాటు రీతూను సుమన్, భరణి కూడా టార్గెట్ చేశారు. డీమన్ ఒక్కడే ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ టవర్స్ ను టార్గెట్ చేశాడు. ఇక తనూజ బాల్స్ విసురుతుంటే రీతూ వద్దు తనూజ అంటూ బ్రతిమిలాడుకుంది. కోపం తట్టుకోలేక తొక్క, తోటకూర అంటూ రీతూ కూడా రివర్స్ అయ్యింది. బాల్స్‌ విసురుతున్న క్రమంలో లైన్‌ దాటుతాడు. దీంతో అతను డిస్‌క్వాలిఫైడ్‌ ఇక రీతూ టవర్ ను ఈజీగా కూలగొట్టేశారు. దాంతో బయటకు వచ్చిన రీతూ కన్నీళ్లు పెట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.