AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: ఏంట్రా మాకు ఇది..! శ్రీజ పై బిగ్ బాస్ కూడా వేశాడయ్యా పంచ్..

బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ లో రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. మొన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ తో రకరకాల గేమ్స్ ఆడుతూ ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. చివరకు సంజన, రమ్య మోక్ష ఉండటంతో సంజనను సేవ్ చేసి రమ్యను ఎలిమినేట్ చేశారు.

Bigg Boss 9: ఏంట్రా మాకు ఇది..! శ్రీజ పై బిగ్ బాస్ కూడా వేశాడయ్యా పంచ్..
Srija
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2025 | 8:15 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9లో రచ్చ రచ్చ జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు.. ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నవారిని నామినేట్ చేశారు. కామనర్స్ కూడా హౌస్ లోకి వచ్చి హౌస్ లో ఉన్నవారిని నామినేట్ చేశారు. ముందుగా హౌస్‌లోకి దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. హౌస్ లోకి శ్రీజ ఎంట్రీ ఇవ్వడంతోనే బిగ్‌బాస్ “ఐయామ్ బ్యాక్.. అలా వెళ్తాను అనుకోలేదు ఇలా వస్తాను అనుకోలేదు”.. అంటూ హౌస్ లోకి అడుగుపెట్టింది. రాగానే ఆమె మధురితో గొడవ పెట్టుకుంది. శ్రీజని చూడగానే కళ్యాణ్ హగ్గు ఇచ్చాడు. దాంతో నేను పొడవడానికి వస్తే నన్ను పొడుస్తున్నారేంటి అంటూ కౌంటర్ వేసింది. దాంతో ఓ క్లారిటీ వచ్చింది.. ఆమె కళ్యాణ్ ను నామినేట్ చేయడానికి వచ్చిందని..

వచ్చిన తర్వాత మధురిని కెలికింది శ్రీజ.. ఎలా ఉన్నారు మాధురి గారు అంటూ పలకరించింది. ఐయామ్ గుడ్.. అని మాధురి అంటే మీ పేరు మాధురి గారా.. మాస్ మాధురా.. రాజు గారా తెలియట్లేదన్నమాట.. అంటే ఏమని పిలవాలా అని.. మళ్లీ పేరు తెలీదని అనుకుంటారు కదా.. అంటూ మధురిని రెచ్చగొట్టింది. దానికి నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవొచ్చు.. అని సమాధానం చెప్పింది. దానికి శ్రీజ మరోసారి మధురిని రెచ్చగొట్టింది. అంటే పేరు తెలియకపోతే అయ్యో నా పేరు తెలీదా అంటారు కదా.. యాక్చువల్లీ బయటికెళ్లి అడిగా చాలా మందిని.. నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుంది అని అన్నారు అందరూ.. అంటూ రెచ్చగొట్టింది.

నాకు కూడా నువ్వు ఎవరో ఇంతవరకూ తెలీదు.. అని మాధురి మరోసారి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు నాతో గొడవపడటానికి వచ్చావా.? అని ఇదే డైలాగ్ రిపీటెడ్‌గా చెప్తారు.. అందరి మధ్యకి వెళ్లి మరీ కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు కదా.. అని శ్రీజ అనగానే అవును నా ఇష్టం అది అని చెప్పింది మాధురి. సరే బాండింగ్స్ బావున్నాయా.. అని శ్రీజ అంటే దానికి హా చాలా బాగున్నాయి అని మాధురి ఆన్సర్ ఇచ్చింది. గేమ్ ఆడటానికి వచ్చారా.. బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా..  శ్రీజ ఆగకుండా మధురితో గొడవపెట్టుకోవడానికి ట్రై చేసింది. అవును బాండింగ్స్ పెట్టుకోవడానికే వచ్చా అంటూ కౌంటర్ ఇచ్చింది మాధురి. మాధురితో అయిపోగానే తనూజతో గొడవ మొదలుపెట్టింది. ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు.. లీనియెన్స్ ఇచ్చేస్తున్నావ్.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. ఇవన్నీ ఒక పర్సన్ అన్నారు.. మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి జాలీగా రాజు రాజు అని బాండింగ్ ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు.. ఇంకో పాయింట్ ఉంది.. సపోర్ట్ సపోర్ట్‌తోనే ఎంతకాలం విన్ అవుతారు. మొన్న ఇమ్మానుయేల్ మీరు ఉన్నప్పుడు గేమ్‌లో నేను ఒక ఆడపిల్లని.. నువ్వు తర్వాత అయినా విన్ అవ్వచ్చు నాకు ఇవ్వొచ్చు కదా అని అడిగారు..ఫస్ట్ నుంచి చూద్దాం.. భరణి గారు బెడ్ టాస్క్, వాటర్ టబ్ టాస్క్, ఇమ్మానుయేల్ బెడ్ టాస్క్, నేను ఇమ్యూనిటీ టాస్క్, కళ్యాణ్‌ అప్పుడప్పుడూ, మొన్న ఇమ్మానుయేల్‌తో నేను ఒక అమ్మాయిని నువ్వు తర్వాత అయినా విన్ అవ్వొచ్చు నాకు ఇచ్చెయ్ అని అడిగారు.. ఎంతకాలం ఇలా సపోర్ట్‌తో ఆడతారు.. మిమ్మల్ని తనూజ అక్క అని ఇప్పుడు అనకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను నిజంగా హౌస్‌లో ఉండి మిమ్మల్ని అక్కా అక్కా అంటే మన ఇద్దరం ఫస్ట్, సెకండ్‌లో ఉంటే అక్కా అంటున్నావ్ కదరా టైటిల్ నాకు ఇచ్చెయ్ అని అంటావేమోనని నాకు అసలు అలా కూడా పిలవాలనిపించడం లేదు.. అంటూ తనూజ పై ఎక్కేసింది. బిగ్‌బాస్ రంగంలోకి దిగాడు. శ్రీజ మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి.. ఆ పని చేస్తే సరిపోతుంది.. అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఒకే బిగ్ బాస్ అని వచ్చిన పని చేసింది శ్రీజ. దాంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ , మీమ్స్ చేస్తున్నారు. శ్రీజకు బిగ్ బాస్ కౌంటర్ ఇవ్వడంతో.. అయ్యయ్యో పరువుపోయిందే అని కొందరు, ఏంట్రా మాకు ఇది అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి