Bigg Boss 8 : బట్టలు సరిగ్గా వేసుకోవడం కూడా రాదు నీకు.. విష్ణుప్రియ పై విరుచుకుపడ్డ సోనియా

|

Sep 10, 2024 | 9:04 AM

విష్ణు ప్రియ సోనియాను నామినేట్ చేసింది. గతవారం జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. నేను అన్న దానికి సారీ చెప్పా.. కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు.. దానికి నాకు సారీ చెప్పలేదు అని విష్ణు ఫిర్యా చెప్పింది. దానికి సోనియా వాదించింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు.. మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు.. నాకు అది అడల్ట్రీనే.. అని సోనియా సీరియస్ గా చెప్పింది.

Bigg Boss 8 : బట్టలు సరిగ్గా వేసుకోవడం కూడా రాదు నీకు.. విష్ణుప్రియ పై విరుచుకుపడ్డ సోనియా
Bigg Boss 8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం నామినేషన్స్ వాడి వేడిగా జరిగాయి. నిన్న జరిగిన నామినేషన్స్ లో ముందుగా కిరాక్ సీతకు, సోనియా కు పెద్ద గొడవే జరిగింది. సోనియా సీతను నామినేట్ చేసింది. దానికి ఆమె చెప్పిన రీజన్ పై సీత మండిపడింది. గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆ తర్వాత విష్ణు ప్రియ సోనియాను నామినేట్ చేసింది. గతవారం జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. నేను అన్న దానికి సారీ చెప్పా.. కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు.. దానికి నాకు సారీ చెప్పలేదు అని విష్ణు ఫిర్యా చెప్పింది. దానికి సోనియా వాదించింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు.. మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు.. నాకు అది అడల్ట్రీనే.. అని సోనియా సీరియస్ గా చెప్పింది. నేను ఏం అడల్ట్రీ జోక్స్ వేశా.? చెప్పండి అని విష్ణు ప్రియా అడిగితే.. మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు.. అంటూ సోనియా అంది.

ఒకళ్లే తెలివైనోళ్లు కాదు.. పిల్ల బచ్చా జోకులేసుకునే దాన్ని అడల్ట్రీ అని ఎట్లా అంటారు.. అని మరోసారి విష్ణు ప్రియా అడిగేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటూ వాదించింది సోనియా. ఆ తర్వాత సోనియా బాలన్స్ తప్పింది. బట్టలు సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు.. ఆయన ఒకవైపు అన్ కంఫర్టబుల్ అంటున్నా కూడా ఆయన పక్కకే వెళ్లి నిల్చొని చేసిందంతా ఏంటి.. నీ మాటలు, చేతలు హౌస్‌లో అందరికీ అలానే అనిపిస్తాయి..అని అంది సోనియా.

దానికి విష్ణు ప్రియా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్లు చెబుతారు.. వాళ్ల గురించి మీరెందుకు చెప్పడం.. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యని కరెక్ట్‌గా వాడాలి అంటూ సోనియా పై కౌంటర్ వేసింది సోనియా. సీత విష్ణు ప్రియా ఇద్దరూ సోనియా పై విరుచుకుపడ్డారు. అటు సోనియా కూడా ఎక్కడ తగ్గకుండా.. ఇద్దరి పై మాటల యుద్ధం చేసింది. మొన్నటికి ముద్దుగుమ్మల మధ్య గట్టిగానే నామినేషన్స్ రచ్చ జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.