Bigg boss 8 : మాణికంఠ మీద ఎందుకంత పగ.. యష్మీకి ఇచ్చిపడేసిన అవినాష్..

|

Oct 09, 2024 | 7:20 AM

. యష్మీ, సీత, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ నామినేషన్స్ లో ఉన్నారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న పాత టీమ్ వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారిలో ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఓజీ టీమ్ అంతా చర్చించుకొని మెహబూబు దిల్ సే అలాగే గంగవ్వను నామినేట్ చేశారు. గంగవ్వను మరి దారుణంగా టీ అడిగిందని నామినేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారి నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి.

Bigg boss 8 : మాణికంఠ మీద ఎందుకంత పగ.. యష్మీకి  ఇచ్చిపడేసిన అవినాష్..
Avinash
Follow us on

బిగ్ బాస్ హౌస్ లో కొత్త హౌస్ లో కొత్త కంటెస్టెంట్స్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్ రచ్చ జరుగుతోంది. కొత్త వాళ్ళు వచ్చిన వెంటనే బిగ్ బాస్ రెండు టీమ్ ల మధ్య చిచ్చు పెట్టాడు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారు హౌస్ లో ఉన్న వారిని నామినేట్ చేయాలని చెప్పాడు దాంతో ఒకొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేశారు. యష్మీ, సీత, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ నామినేషన్స్ లో ఉన్నారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న పాత టీమ్ వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారిలో ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఓజీ టీమ్ అంతా చర్చించుకొని మెహబూబు దిల్ సే అలాగే గంగవ్వను నామినేట్ చేశారు. గంగవ్వను మరి దారుణంగా టీ అడిగిందని నామినేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారి నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. టేస్టీ తేజ యాష్మి, అలాగే మణికంఠను నామినేట్ చేశాడు. మణికంఠను నామినేట్ చేస్తుంటే యష్మీ మొఖం వెలిగిపోయింది.

ఆ తర్వాత అవినాష్ వచ్చి యష్మిని నామినేట్ చేశాడు. మనోడు యష్మీకి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. మణికంఠని నామినేట్ చేస్తుంటే.. మీరు ఎస్ ఎస్ అని తెగ రియాక్ట్ అయ్యారు. అతనిపై ఎంత పగలేకపోతే అలా బిహేవ్ చేస్తావ్.? ఎందుకు అతన్ని మళ్లీ మళ్లీ పొడుస్తున్నావ్. ఇది పగ పెట్టుకోవడం కాదా? అని తన పాయింట్ చెప్పాడు అవినాష్. ఆతర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు.

అవినాష్ పృథ్వీ గురించిన రీజన్ చెప్తూ.. ఆ బెలూన్ టాస్క్‌లో తప్పితే నువ్వు ఎక్కడా గేమ్ ఆడినట్టుగా లేదు. అసలు నువ్వు టాస్క్‌లు కాకుండా ఏం చేశావో చెప్పు.. అని అన్నాడు. దానికి పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. నామినేట్ ఎందుకు చేస్తున్నావో నీకే తెలియదు.. టాస్క్‌లు తప్ప ఇంకేం చేయాలి అని అడిగాడు పృథ్వీ. అయితే ఎందుకు వచ్చావ్.? విన్ అవుతావా.? అవ్వు అయితే అన్ని తిరిగి కౌంటర్ ఇచ్చాడు అవినాష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.