AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Day 08:అమ్మబాబోయ్..! ఇదెక్కడి రచ్చ రా బాబు.. కొట్టుకున్నంత పని చేసిన సీత, సోనియా

యష్మి చీఫ్ గాఉన్న టీమ్ పెద్దగా ఉండటంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పాడు బిగ్ బాస్.. దాంతో ఈ నామినేషన్స్ లో యష్మి తప్పించుకుంది. ఈ నామినేషన్స్ లో కిరాక్ సీత గట్టిగానే ఇచ్చిపడేసింది. గతవారం నాగార్జున సీత గురించి మాట్లాడుతూ.. ఆమెలో కిరాక్ తగ్గింది అని చెప్పారు.

Bigg Boss 8 Day 08:అమ్మబాబోయ్..! ఇదెక్కడి రచ్చ రా బాబు.. కొట్టుకున్నంత పని చేసిన సీత, సోనియా
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Sep 10, 2024 | 7:47 AM

Share

సోమవారం రోజున బిగ్ బాస్ రెండో వారం నామినేషన్ మొదలు పెట్టాడు. ఒకొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలని అన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత నామినేట్ చేసిన వారి తలపై పెయింట్ వాటర్ పోయాలని చెప్పాడు. అయితే యష్మి చీఫ్ గాఉన్న టీమ్ పెద్దగా ఉండటంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పాడు బిగ్ బాస్.. దాంతో ఈ నామినేషన్స్ లో యష్మి తప్పించుకుంది. ఈ నామినేషన్స్ లో కిరాక్ సీత గట్టిగానే ఇచ్చిపడేసింది. గతవారం నాగార్జున సీత గురించి మాట్లాడుతూ.. ఆమెలో కిరాక్ తగ్గింది అని చెప్పారు. దాంతో ఈసారి సీత రెచ్చిపోయింది. సోనియాతో గట్టిగానే గొడవేసుకుంది సీత. సోనియా ముందుగా సీతను నామినేట్ చేసింది. నీకు టాస్కే అర్థం కాలేదని నాకు క్లియర్ గా అర్థమైంది.. అందుకే చెత్త బుట్ట గురించి పనుల గురించి కంప్లెయింట్ చేస్తున్నాం. అయినా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ముందు మీ చీఫ్‌కి చెప్పాలి.. ఇక్కడ కాదు అని సోనియా అంటే దానికి ఓ రేంజ్ లో రెచ్చిపోయింది సీత.

నాకు క్లారిటీ ఉందని నాకు తెలుసు.. అది నీ అభిప్రాయం.. నాకు నొప్పొస్తే నేను చెబుతా.. మీ దాంట్లో మీకు నొప్పేస్తే మీ చీఫ్‌ దగ్గరికెళ్తారేమో.. అంటూ సీత ఇచ్చిపడేసింది. దానికి సోనియాకు ఇంకా కోపం వచ్చింది. దాంతో మీ గ్రూపంతా ఫెయిల్ అయ్యారు.. అయినా ఇండివీడ్యూయల్‌గా చెప్పుకుంటే ఇంకేంది బిగ్‌బాస్.. అంటే బిగ్‌బాస్ పిచ్చోడా.. డివైడ్ చేసి టీమ్ ఇచ్చినోడు పిచ్చోడా.. అంటూ బిగ్ బాస్ ను కూడా కలిపి తిట్టింది సోనియా. దానికి సీత గట్టిగానే రీప్లే ఇచ్చింది.

“ముందు నువ్వు గేమ్ అర్థం చేసుకొని తర్వాత నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్.. ముందు నీకు గేమ్ అర్థం కాలేదు.. ఇది ఇండివీడ్యువల్ గేమ్ కాకపోతే వెళ్లి నీ నామినేషన్ నీ చీఫ్‌ను చెయ్యమను.. నువ్వెందుకు చేస్తున్నావ్..? క్లారిటీ నాకు నీకు ఉంది.. బొక్కలో క్లారిటీ..”అంటూ తిట్టుకుంది సీత. దానికి సోనియా ఎక్కువ మాట్లాడకు సీత అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది నిన్ను నేను బొక్క అన్నన్నా.. ?లేదు గా “నీ రాజ్యంలో నీ రాజు తప్పయినా మీరు ఒంగుతారేమో.. కానీ నేను మాట్లాడతా.. నా ఇష్టం నేను మాట్లాడతా.. అంటూ వాయిస్ రైజ్ చేసింది సీత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..