బిగ్ బాస్ హౌస్ లో మాయ అస్త్ర కోసం హౌస్ లో ఉన్నవారు గట్టిగానే పోటీ పడ్డారు. రణధీర, మహాబలి రెండు టీమ్స్ గా విడదీసి గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో శివాజీ తన తెలివితో టీమ్ ను గెలిపించుకున్నాడు. రణధీర టీమ్ లో ఉన్న శివాజీ, అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, షకీలా విజయం సాధించారు. ఈ టీమ్ కు మాయాస్త్ర కీ సొంతం చేసుకున్నారు. మహాబలి టీం శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, దామినిని శివాజీ ఓ ఆటాడుకున్నారు. దామిని, శుభ శ్రీలు తాళం కొట్టేయడానికి తెగ ట్రై చేశారు. శివాజీ నిద్ర పోతున్న సమయంలో కీ కొట్టేయడానికి రాతిక తెగ ట్రై చేసింది. కానీ శివాజీ ఆమెకు పిచ్చి పిచ్చి క్లూలు ఇస్తూ.. ఆమెను ఆడుకున్నాడు. మీరు ఆడేది శివాజీతో.. ఈ తాళం తీయడం మీ వల్ల కాదు అంటూ గాలి తీశాడు. గేమ్ ఆడకుండా గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి కీ ఎలా కొట్టేయాలి అని అలోచించి బోర్లా పడ్డారు.
ఇక కీ దొరక్కపోయే సరికి శుభ శ్రీ సందీప్ దగ్గర ఉన్న పవర్ అస్త్రను కొట్టేసింది. శివాజీ అయితే మహాబలి టీమ్ ను ముప్పు తిప్పలు పెట్టాడు. కీని దాచిపెడుతున్నట్టు యాక్ట్ చేసి మహాబలి టీమ్ లో ఉన్న వాళ్ళను బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ను. గ్రీన్ మ్యాట్ కింద కీ దాస్తున్నట్టు యాక్ట్ చేశాడు. అది చాటుగా చూసిన ప్రశాంత్ పిచోడిలా అక్కడ వెతుకున్నాడు.
ఆతర్వాత మాయాస్త్ర సాధించడం కోసం మరో కీ కోసం మలుపులో ఉంది గెలుపు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ గేమ్ లో కూడా శివాజీ టీమే గెలిచింది. అయితే రణధీర టీమ్ ను యాక్టివిటీ రూమ్ కు పిలిచి సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. మాయాస్త్ర ను రణధీర టీమ్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సందీప్ దగ్గరున్న పవర్ అస్త్రను నొక్కేసింది శుభశ్రీ. దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి శివాజీ ఈసారి హౌస్ లో హైలైట్ అయ్యారు. తన తెలివి తేటలతో మహాబలి టీమ్ ను బోల్తా కొట్టించి తన టీమ్ ను గెలిపించుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.