Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. పిచ్చెక్కి రెచ్చిపోయిన శోభా శెట్టి

రెండో రోజు శివాజీ, ప్రియాంక జైన్ తాము ఎవరిని నామినేట్ చేస్తున్నామో చెప్పి అందుకు గల కారణాలు కూడా చెప్పారు. ఇక మూడో రోజు శోభా శెట్టి తో నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ అమ్మడు డెవిల్ రూమ్ లోకి వెళ్లడంతోనే ఓవర్ యాక్షన్ మొదలు పెట్టింది. తెగ భయపడిపోతున్నటు మీకు దండం పెడతా బిగ్ బాస్ అంటూ ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చింది. దాంతో బిగ్ బాస్ చాల్లే ఎవరిని నామినేట్ చేస్తావ్ చెప్పు అనడంతో గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ పేర్లు చెప్పింది. అందుకు కారణాల ఏంటి అని ప్రశ్నించగా..కిరణ్ రాథోడ్ కు తెలుగు రాదు అని చెప్పింది.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. పిచ్చెక్కి రెచ్చిపోయిన శోభా శెట్టి
Shobha Shetty

Updated on: Sep 06, 2023 | 8:16 AM

బిగ్ బాస్ హౌస్ లో హడావిడి మొదలైంది. తొలి రోజే నామినేషన్స్ ప్రకియ మొదలు పెట్టడంతో ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేసి వారిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పుకొచ్చారు. రెండో రోజు శివాజీ, ప్రియాంక జైన్ తాము ఎవరిని నామినేట్ చేస్తున్నామో చెప్పి అందుకు గల కారణాలు కూడా చెప్పారు. ఇక మూడో రోజు శోభా శెట్టి తో నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ అమ్మడు డెవిల్ రూమ్ లోకి వెళ్లడంతోనే ఓవర్ యాక్షన్ మొదలు పెట్టింది. తెగ భయపడిపోతున్నటు మీకు దండం పెడతా బిగ్ బాస్ అంటూ ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చింది. దాంతో బిగ్ బాస్ చాల్లే ఎవరిని నామినేట్ చేస్తావ్ చెప్పు అనడంతో గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ పేర్లు చెప్పింది. అందుకు కారణాల ఏంటి అని ప్రశ్నించగా..కిరణ్ రాథోడ్ కు తెలుగు రాదు అని చెప్పింది. తనకు కూడా తెలుగు మాట్లాడటం రాదు. కానీ నేను అర్ధం చేసుకుంటా.. కిరణ్ కు తెలుగు రాకపోతే ఆమె టాస్క్ లు ఎలా అర్ధం చేసుకుంటుంది. ఎలా ఆడుతుంది.? అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది.

ఇక గౌతమ్ గురించి చెప్తూ.. ఓ చెత్త రీజన్ చెప్పింది. దానికి ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. నిజానికి గౌతమ్ సైలెంట్ గానే ఉన్నా శోభా మాత్రం నోటికొచ్చినట్టు అరిచింది. గౌతమ్ మేడమ్ అంటూ మర్యాదగా మాట్లాడినా శోభా మాత్రం తన పైత్యం మొత్తం చూపించింది. ఆ తర్వాత గౌతమ్ శోభా శెట్టిని నామినేట్ చేశాడు. దంతే ఈ అమ్మడికి చిర్రెతుకొచ్చి. అతడి దగ్గరకు వెళ్లి మళ్లీ గొడవ పెట్టుకుంది.

నా నామినేషన్ నా ఇష్టం.. నాకు నచ్చి నట్టు చేస్తుకుంటా.. నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేశావ్. నిన్ను నామినేట్ చేశానన్న రీజన్ తో నువ్వు నన్ను నామినేట్ చేస్తావా అంటూ అరిచి గోల చేసింది. నామినేషన్ తర్వాత శోభా గారు అంటూబ్ మర్యాదగా పలకరించాడు గౌతమ్.. దానికి ఆమె యాటిట్యూడ్ చూపించింది. అంత గారు గీరు అవసరం లేదు.. అని అంది. దానికి గౌతమ్ మేడం అనేది నా స్లాంగ్ అండి. నేను అందరిని అలానే పిలుస్తాను అని చెప్పినా కూడా ఆమె వినిపించుకోకుండా రెచ్చిపోయింది . సర్లే అని గౌతమ్ వెళ్లిపోతున్నా కూడా మీరు చెప్పింది నేను విన్నాను మరి నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోతున్నారేంటి.. ? అంటూ రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ వారం మొత్తంగా ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. నామినేషన్ లో ఉన్న వారిలో.. శోభా శెట్టి,  రతిక,  ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్,  గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని భట్ల నామినేట్ అయ్యారు.