బిగ్ బాస్ సీజన్ 7 లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. మొదటి రోజు నుంచి ఉల్టా పుల్టా అంటూ చెప్పుకొస్తున్నారు. చెప్పినట్టుగానే ఇప్పటికే హౌస్ లో చాలా ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే ఎలిమినేషన్స్ విషయంలోనూ ఎవ్వరు ఉహించనివి జరుగుతున్నాయి ఎలిమినేట్ అవుతారు అనుకున్నవారు సేవ్ అవుతున్నారు. ఉంటారు అనుకున్నవారు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా గతవారం జరిగిన ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చాయి. శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ నయని పావని ఎలిమినేట్ అయ్యింది. నిజానికి నయని ఉన్నది వారమే అయినా.. బాగానే ఎంటర్టైన్ చేసింది. గేమ్స్ లోనూ టాస్క్ లోనూ బాగానే ఆడింది కానీ ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారాం కూడా ఇలానే ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేయాన్నాడట బిగ్ బాస్.
ఈ వారం హౌస్ లోకి ఓ రీ ఎంట్రీ ఉండనుంది. ఇప్పటికే హౌస్ రోలీ రతికా రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎంట్రీ దాదాపు ఖరారు అయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ వారం భోలే షావలి ఎలిమినేట్ కానున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఎలిమినేషన్స్ నుంచి భోలే సేవ్ అయ్యాడని తెలుస్తోంది. నామినేషన్స్ సమయంలో సీరియల్ బ్యాచ్ అంతా కలిసి భోలే పై రివర్స్ అవ్వడం.. అతను కూడా వెటకారంగా సెటైర్లు వేయడం తెలిసిందే. అయితే భోలే కి సింపథీ వర్కౌట్ అయ్యిందని తెలుస్తోంది.
దాంతో ఓట్లు బాగా రావడంతో అతడు సేవ్ అయ్యాడని అంటున్నారు. ఇక డేంజర్ జోన్ లో ఉన్న పూజా మూర్తి, అశ్విని లో పూజా మూర్తి ఈ వారం ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోతోందని అంటున్నారు ఆడియన్స్. ఈ కారణంతోనే ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అశ్వినితో గొడవపడటం తప్ప పూజా ఎక్కువగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. దాంతో ఈ వారం పూజా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఆడియన్స్. చూడాలి మరి ఏంజరుగుతుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి