Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి కొత్తవాళ్లు .. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడంటే

ఈ సారి  14 మందినే పంపించారు. అందులో ఎవరు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ కాదు అని ఆడి గెలిచినా వల్లే హౌస్ మేట్స్ గా ఎంపిక అవుతారని తెలిపాడు. దాంతో ఇప్పుడు హౌస్ లో నుంచి ఒకొక్కరుగా ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక యి వారం కూడా ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. అలాగే ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఈ వారం మరొకరు హౌస్ మెట్ గా కన్ఫర్మ్ కానున్నారు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి కొత్తవాళ్లు .. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడంటే

Updated on: Sep 29, 2023 | 1:08 PM

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా గా ఉంటుందని ముందుగానే నాగార్జున చెప్పారు. ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక అయితే గత సీజన్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయన్న విమర్శలు ఎదురయ్యాయి. దాంతో ఈసారి సీజన్ 7 ను చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ 7 లో ముందుగా 14 మందిని హౌస్ లోకి పంపించారు. అంతకు ముందు దాదాపు 20 మందిని హౌస్ లోకి పంపించే వారు. ఈ సారి  14 మందినే పంపించారు. అందులో ఎవరు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ కాదు అని ఆడి గెలిచినా వల్లే హౌస్ మేట్స్ గా ఎంపిక అవుతారని తెలిపాడు. దాంతో ఇప్పుడు హౌస్ లో నుంచి ఒకొక్కరుగా ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక యి వారం కూడా ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. అలాగే ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఈ వారం మరొకరు హౌస్ మెట్ గా కన్ఫర్మ్ కానున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరికొంతమందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 9న బిగ్ బాస్ మరోసారి లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్ తో మరో ఆరుగురు లేదా ఏడుగురు కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..