Bigg boss 7 telugu: ఇది అభిమానమా..? ఉన్మాదమా..? అన్నపూర్ణ గేటు ముందు రచ్చ రచ్చ

|

Dec 18, 2023 | 8:35 AM

ఇది అభిమానమా..? ఉన్మాదమా..? ఈ భౌతిక దాడులు ఏంటి..? బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అయిన అమర్ దీప్‌ని అతని ఫ్యామిలీని తరిమితరిమి కొట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. అల్లరి మూకల గుంపు అతని కారుపై ఒక్కసారిగా కారుపై దాడి చేసింది. అందులో మహిళలు ఉన్నారని కూడా చూడలేదు. ముందు నుంచి వెనుక నుంచి కారును ద్వంసం చేస్తూ సైకోలుగా ప్రవర్తించారు కొందరు.

Bigg boss 7 telugu: ఇది అభిమానమా..? ఉన్మాదమా..? అన్నపూర్ణ గేటు ముందు రచ్చ రచ్చ
Fans Fight
Follow us on

ఈ రచ్చేంది బిగ్‌బాస్‌.. హౌస్‌ నుంచి బయటకు రాగానే ఈ రచ్చేంటంట..! ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గర హంగామా చూస్తే ఎవరైనా ఈ మాటే అంటారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ ‌వద్ద రచ్చ రచ్చ చేశారు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌ అభిమానులు.  రెండు వర్గాలుగా విడిపోయి వీళ్లంతా వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి అది కొట్లాటవరకూ వెళ్లింది.  ఈ క్రమంలోనే కొందరు ఆర్టీసీ బస్సుతో పాటు మరికొన్ని వాహనాలపైనా దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కి చేరుకుని లాఠీచార్జ్‌ చేసి అభిమానులను చెదరగొట్టారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-7 టైటిల్‌ను యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ దక్కించుకున్నాడు. రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ నిలిచాడు. ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు అభిమానులు. ఈ క్రమంలో రెండు వర్గాల అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ ఆర్టీసీ బస్సుపైనా దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

— రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ కారుపై దాడి జరిగింది.  కారులో ఉన్న అమర్ దీప్‌ని అతని భార్యని బూతులు తిడుతూ సైకోలుగా బిహేవ్ చేశారు. అమర్ దీప్‌ను కారు నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒకడైతే ఏకంగా కారు పైకి ఎక్కేశాడు. దీంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారని సమాచారం.  హౌస్‌లో ఉన్న సమయంలో అమర్‌దీప్‌, పల్లవి ప్రసాద్‌ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే ఈ ఉద్రిక్తతలకు కారణంగా చెప్తున్నారు. టైటిల్‌ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ రాత్రి 10 గంటల వరకూ కనిపిస్తే.. ఆ తర్వాత అర్థరాత్రి వరకూ ఫ్యాన్స్‌ కొట్లాట ఉద్రిక్తతలకు దారి తీసింది. గొడవకు సంబంధించిన విజువల్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై పలవురు సిటిజన్స్  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండిపడుతున్నారు. అసలు ఎమోషన్స్ రెచ్చగొట్టే బిగ్ బాస్ షోనే రద్దు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.