ఈ బిచ్చగాడు రియల్‌ హీరో.. క్యాన్సర్‌ రోగుల కోసం కదిలిన విజయ్‌ ఆంటోని.. ఉచితంగా చికిత్స అందిస్తానంటూ..

|

May 29, 2023 | 6:20 PM

రాజమహేంద్రవరానికి వెళ్లిన విజయ్‌ ఆంటోని అక్కడి జీఎస్‌ఎల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన మామోగ్రఫీ యూనిట్‌ను ప్రారంభించాడు. అనంతరం అక్కడి వైద్యులతో కాసేపు మాట్లాడిన అతను క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రోగులతో కూడా మాట్లాడారు.

ఈ బిచ్చగాడు రియల్‌ హీరో.. క్యాన్సర్‌ రోగుల కోసం కదిలిన విజయ్‌ ఆంటోని.. ఉచితంగా చికిత్స అందిస్తానంటూ..
Vijay Antony
Follow us on

‘బిచ్చగాడు 2’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు హీరో విజయ్‌ ఆంటోని. మే 16న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే బిచ్చగాడు 2 కు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తూ తమ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరానికి వెళ్లిన విజయ్‌ ఆంటోని అక్కడి జీఎస్‌ఎల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన మామోగ్రఫీ యూనిట్‌ను ప్రారంభించాడు. అనంతరం అక్కడి వైద్యులతో కాసేపు మాట్లాడిన అతను క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రోగులతో కూడా మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్‌ ఆంటోని క్యాన్సర్‌ బాధితులకు ఒక శుభవార్త చెప్పారు. ఎవరికైనా క్యాన్సర్ రోగులకు చికిత్స నిమిత్తం ఏమైనా అవసరం ఉంటే తనను సంప్రదించవచ్చన్నారు. ఎవరైనా డబ్బుకు ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకునేందుకు అవస్థలు పడుతున్న వారికి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తాననని హామీ ఇచ్చారు. ఇందుకోసం 9841025111  అనే ఫోన్ నంబర్ లేదా antibikiligsl@gmail.com అనే ఇ-మెయిల్ ఐడీ ద్వారా తమను సంప్రదించాలని కోరారు.

విజయ్‌ ఆంటోని ప్రకటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తిరుపతిలో యాచకులకు స్వయంగా యాంటి బికిలీ కిట్లు పంచడం, ఆ తర్వాత రాజమహేంద్రవరంలో యాచకులను రెస్టారెంట్‌ తీసుకెళ్లి తన గొప్ప మనసును చాటుకున్నారు విజయ్‌. ఇప్పుడు క్యాన్సర్‌ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తామంటూ మరో ప్రకటన చేశారు. ఇది విన్న విజయ్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిచ్చగాడు హీరో ప్రకటించిన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిచ్చగాడు సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ, సంగీత బాధ్యతలు కూడా విజయ్‌నే నిర్వర్తించాడు. ఇక ఈ సినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ ఆంటోనీ సతీమణి ఫాతిమా ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.