
Khushi Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినీ కెరీర్ లో ఖుషి మూవీ ఎప్పుడూ స్పెషల్. ఈ సినిమాలో పవన్, భూమిక చావ్లా(Bhumika Chawla) జోడీ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. యువకుడు(Yuvakudu) సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టిన భూమిక.. ఖుషి సినిమాతో కుర్రకారికి కలల సుందరిగా మారిపోయింది. అప్పట్లో భూమికని ప్రేమించని యువకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఇక భూమిక నడుమ సీన్ బోలెడంత పాపులర్ అయింది. ఇప్పటికే అనేక సినిమాల్లో ఈ సీన్ ను అనుకరించడమో.. సందర్భంగా బట్టి గుర్తు చేసుకోవడమో చేస్తూనే ఉన్నారు. తాజాగా భూమిక అమ్మాయే సన్నగా అంటూ మళ్ళీ ఆ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఖుషి సినిమాతో హిట్ అందుకున్న ఈ సుందరి.. మహేష్ బాబు తో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి బాక్సాఫీస్ హిట్స్ సినిమాల్లో నటించింది. అయితే పవన్, మహేష్, ఎన్టీఆర్ తో జోడీ కట్టిన సినిమాలన్నీ వారికి ఏడవ సినిమా కావడం.. వారి హిట్స్ లో భూమిక హీరోయిన్ గా నటించడం ఎప్పటికీ వెరీ వెరీ స్పెషల్. ఇక మిస్సమ్మ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి భూమిక తన నటనతో అలరించింది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా.. మల్లెపూవు, సత్యభామ వంటి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసి ఆకట్టుకుంది.
యోగా గురువు భరత్ ఠాగూర్‌ను పెళ్ళి చేసుకొని సినిమాలకు దూరమైన భూమిక మళ్ళీ బాలీవుడ్ లో ధోనీ బయోపిక్ తో పాటు, నాని హీరోగా నటించిన ఎంసిఎ సినిమాతో టాలీవుడ్రీ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read: