Bandla Ganesh: ఓజీ డైరెక్టర్ సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్ కల్యాణ్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడేమీ సినిమాలు చేయడం లేదు. కానీ తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో ఉంటున్నాడీ ప్రొడ్యూసర్. తాజాగా మరోసారి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాడు బండ్లన్న. పూర్తి వివరాలు తెలసుకుందాం రండి..

Bandla Ganesh: ఓజీ డైరెక్టర్ సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్ కల్యాణ్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
Pawan Kalyan, Bandla Ganesh

Updated on: Dec 17, 2025 | 9:12 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలేవీ చేయడం లేదు. కానీ సినిమా ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అక్కడ హీరోలను ఉద్దేశించి అతను చేసే కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని సార్లు కాంట్రవర్సీకి కూడా దారి తీస్తున్నాయి. ఆ మధ్యన కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ సక్సెస్ ఈవెంట్ లో ఓ టాలీవుడ్ హీరోనూ ఉద్దేశిస్తూ బండ్లన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక సోషల్ మీడియాలోనూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతుంటాడు బండ్ల గణేశ్. అలా తాజాగా ఆయన ట్విట్టర్ (ఎక్స్ )లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల పవన్ కల్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజిత్ కు ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. ఓజీ రూపంలో తనకు సూపర్ హిట్ సినిమా ఇచ్చినందుకుగానూ పవన్ ఈ కారును సుజిత్ కు బహుమతిగా అందించారు. ఈ కారు ధర సుమారు రూ. కోటి వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంపై బండ్ల గణేశ్ స్పందించారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పెట్టాడు.

పవన్ కళ్యాణ్ సుజిత్ కారుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన బండ్లన్న..’కంగ్రాట్యులేషన్స్.. మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు’ అంటూ పోస్ట్ పెట్టారు బండ్లన్న. కాగా పవన్ కల్యాణ్ ను అమితంగా ఆరాధిస్తాడు బండ్ల గణేశ్. పవర్ స్టార్‌ని ఏకంగా దేవుడితో పోలుస్తుంటారు బండ్లన్న. ఏదైనా సినిమా ఈవెంట్ కు వెళితే పవనామస్మరణతో రెచ్చిపోతుంటాడీ నిర్మాత. ఇప్పుడు పవన్ కల్యాణ్ తనకు జీవితమిచ్చారంటూ మరోసారి డిప్యూటీ సీఎంపై తన అభిమానాన్ని చాటుకున్నాడు బండ్ల గణేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

బండ్ల గణేశ్ ట్వీట్..

 

పవన్ కల్యాణ్ తో ఓజీ డైరెక్టర్ సుజిత్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us