
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి గత రికార్డులన్నీ తుడిచేస్తోంది. ఇప్పటికే ఈ మెగా మూవీ కలెక్షన్లు రూ. 300 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో మెగాభిమానులకు నచ్చే మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ మెగాస్టార్ సినిమా కోసం థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను చూస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారాయన. చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసున్న ఫొటోను పంచుకున్న బండ్ల గణేష్.. ‘ఇది కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు… ఇది పొంగల్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య స్వాగ్, ఆయన టైమింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు సరైన పండుగ… ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్. తమ్ముడు అనిల్ రావిపూడి.. నువ్వు నిజమైన మాంత్రికుడివి. ఆడియెన్స్ ను కంప్లీట్ బ్లాక్‌బస్టర్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లావు. బాక్సాఫీస్ తో కబడ్డీ ఆడటం నీకన్నా బాగా ఎవరికి తెలీదు. నువ్వు తోపు కాదు.. తోపులకు బాప్ వి”
‘విక్టరీ వెంకటేష్ తన డైనమిక్ స్పెషల్ క్యామియోతో స్క్రీన్‌లను షేక్ చేసాడు. చిరు గారు – వెంకీ గారు కలిపి తెరపై చూడటం ఫుల్ మాస్ మూమెంట్. నిర్మాతగా మెగా అరంగేట్రం చేసిన సుష్మిత కొణిదెలకు, అనిల్‌తో మరో భారీ బ్లాక్‌బస్టర్‌ని అందించిన సాహు గారపాటికి అభినందనలు. ఈ సినిమాని ఎవడూ ఆపలేడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ టీమ్ మొత్తానికి అభినందనలు’ అని రాసుకొచ్చారు.
Bandla Ganesh
ప్రస్తుతం బండ్ల్ గణేష్ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగాభిమానులు, నెటిజన్లు బండ్లన్న ఎలివేషన్స్ సూపర్బ్ గా ఉన్నాయంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..