Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ?.. ఎప్పుడు ఎక్కడ కానుందంటే..

|

Nov 10, 2023 | 8:24 AM

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటనకు అడియన్స్ మరోసారి ఫిదా అయ్యారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా బాల్యయ కెరీర్లోనే అత్యధకి వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఇందులో కాజల్ కీలకపాత్రలో కనిపించింది. ఇప్పటివరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ?.. ఎప్పుడు ఎక్కడ కానుందంటే..
Bhagavanth Kesari Movie
Follow us on

ముందు నుంచి చెప్పినట్లే భగవంత్ కేసరి సినిమాతో మరో బాలకృష్ణను అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటనకు అడియన్స్ మరోసారి ఫిదా అయ్యారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా బాలయ్య కెరీర్లోనే అత్యధకి వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఇందులో కాజల్ కీలకపాత్రలో కనిపించింది. ఇప్పటివరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఈనెల 23 నుంచి ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొన్ని రోజులుగా భగవంత్ కేసరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముందుగా నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుందని అన్నారు. ఇప్పుడు నవంబర్ 23నే స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం నడుస్తుంది. మరీ ఈ రెండింటిలో ఏది నిజమనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించినందుకు గురువారం బైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో బనావో బేటీ కో షేర్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కే.రాఘవేంద్ర రావు, అంబికా కృష్ణ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భగవంత్ కేసరి సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుతోపాటు.. టెక్నీషియన్స్ అందరిని సత్కరించాలని.. అందరూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడం కోసం ప్రాణం పెట్టి పనిచేశారని అన్నారు. అలాగే ఇంతటి విజయవంతమైన సినిమాను తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు, హరీష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఫైట్ మాస్టర్ వెంకట్, హీరోయిన్స్ కాజల్, శ్రీలీల, నటుడు అర్జున్ రామ్ పాల్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.