
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడి సినీ అరంగేట్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా చేయబోయే సినిమా ఏదీ ?.. అసలు డైరెక్టర్ ఎవరు ?.. అనే ప్రశ్నలు నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి. ఇప్పటికే స్టార్ హీరోలందరి వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ బాలయ్య తనయుడి రాక మాత్రం ఇప్పటికీ జరగలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు మోక్షజ్ఞ ఎంట్రీపైనే పడింది. ఇదే విషయమై ఎన్నోసార్లు బాలయ్యను అడిగారు ఫ్యాన్స్. అయితే ఈ ఏడాది తన కుమారుడి తెరంగేట్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు బాలయ్య. అదే సమయంలో తన తండ్రి మూవీ షూటింగ్ సెట్లో… ఈవెంట్లలో మోక్షజ్ఞ యాక్టివ్గా పాల్గొనడంతో ఈసారి నందమూరి వారసుడి అరంగేట్రం ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ మళ్లీ మోక్షజ్ఞ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా అభిమానులకు కిక్కిచ్చే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో ఇప్పుడు బాలయ్య తనయుడి ఎంట్రీ కన్ఫార్మ్ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
తాజాగా మోక్షజ్ఞ న్యూలుక్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎప్పుడూ బొద్దుగా కనిపించిన బాలయ్య తనయుడు ఇప్పుడు బరువు తగ్గి మంచి ఫిట్ నెస్ తో.. స్టైలీష్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా వైరలవుతున్న ఫోటో చూస్తుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. బ్లాక్ డ్రెస్ లో స్టైలీష్ గా కనిపించి వావ్ అనిపించేలా ఉన్నాడు. మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోతోపాటు.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నందమూరి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఉంగరాల జుట్టు.. కళ్లు.. టీనేజ్ లో తన అన్నట్లు ఉన్నట్లే కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. ప్రస్తుతం అతడు విశాఖపట్నంలో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే బాలయ్య కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం. ఈ చిత్రాన్ని స్వయంగా బాలయ్య దగ్గరుండి నిర్మించనున్నారని.. ఈ సినిమాతోనే హీరోగా తన వారసుడిని అభిమానులకు పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.
Young Lion 🦁 #Mokshagna #NBK109#GodOfMassesNBK pic.twitter.com/oOg8sL5TNW
— JS (@jsktweet7) February 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.