Mokshagna: అందుకే మోక్షజ్ఞ సినిమా ఆగిపోయింది.. అసలు విషయం చెప్పిన బాలకృష్ణ

|

Dec 06, 2024 | 12:11 PM

మోక్షజ్ఞ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలకృష్ణ.. మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిపోయిందో తెలిపారు బాలకృష్ణ.

Mokshagna: అందుకే మోక్షజ్ఞ సినిమా ఆగిపోయింది.. అసలు విషయం చెప్పిన బాలకృష్ణ
Balakrishna
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విహాయం తెలిసిందే..ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అలాగే హనుమాన్ సిరీస్ లో భాగంగా చాలా సినిమాలు తెరకెక్కించనున్నాడు ప్రశాంత్. ఇప్పటికే జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా కన్నడ హీరో, జాతీయ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఇక మోక్షజ్ఞ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..

ఇదిలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ సినిమాల గురించి తాజాగా బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా కాకినాడలో ఓ జ్యుయలర్ షాప్ ఓపినింగ్ కు హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. పుట్టినరోజు నుంచి ప్రతీ వేడుకకు అమ్మాయికి కొనే బంగారం విలువ ఆమె వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని, బంగారమంటే ఖర్చు మాత్రమే కాదని అది భవిష్యత్తు తరాలకు సంపదన్నారు. కాకినాడ తన అత్తవారి ఇళ్లని ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ జిల్లా యాస చాలా వెటకారంగా, ప్రేమగా ఉంటుందన్నారు. అలాగే  కాకినాడతో ఆయనకి ఉన్న అనుబందాన్ని బాలయ్య గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.

అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అలాగే మోక్షజ్ఞ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ రోజు సినిమా మొదలు పెట్టాల్సింది. అనివార్యకారణాల వల్ల.. మోక్షజ్ఞకు ఆరోగ్యం బాలేకపోవడం వల్ల షూటింగ్ మొదలు కాలేదు.. అంతా మనమంచికే అన్నారు బాలయ్య. జ్వరంగా ఉండటంతో పూజాకార్యక్రమం మొదలు కాలేదు అని తెలిపారు. కాగా బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.