గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ విజయాల పరంపర కొనసాగుతుంది. అఖండ సినిమాతో మొదలు పెట్టి వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇక ఇప్పుడు డాకు మహారాజ్. ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ మంచి విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు బాబీ, అలాగే భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చింది డాకు మహారాజ్.
తొలి షో తోనే డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో ఇరగదీశాడు. అలాగే ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించారు. డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్య జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా నటించారు. అలాగే తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచిందని చూసిన ఆడియన్స్ అంటున్నారు. డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాలకృష్ణ బాసఫీస్ దగ్గర సత్తా చాటారు. ఈ సినిమా తొలి రోజే బాగా కలెక్ట్ చేసింది.
డాకు మహారాజ్ తొలి రోజే రూ. 56 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాలయ్య స్టామినా ఏంటో చూపించింది. ఇక రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది ఈ సినిమా.. ఈమేరకు మూవీ మేకర్స్ డాకు మహారాజ్ సెకండ్ డే కలెక్షన్స్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా రూ. 74కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్ ఈ సినిమాను వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక బాలకృష్ణ ఈ సినిమాలో మరోసారి తన నటవిశ్వరూపం చూపించారు. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ లో బాలకృష్ణ ఇరగదీశారనే చెప్పాలి. మొత్తంగా డాకు మహారాజ్ సంక్రాంతికి భారీ హిట్ అందుకుంది.
#DaakuMaharaaj ROARS with a MASSIVE ₹𝟕𝟒+ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 Worldwide Gross in 2 DAYS! 🔥
Arachakam batting today. 100CR Gross by today 😎🔥🥵#DaakuMaharaaj @dirbobby #NandamuriBalakrishna #BlockBusterDaakuMaharaaj pic.twitter.com/NksiYhtMJa
— NBK Cult 🦁 (@iam_NBKCult) January 14, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి