Balakrishna Boyapati Movie Name: నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషనల్ ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ అంచనాలకు తగ్గట్లుగానే బోయపాటి ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ బాలయ్య బాబులోని నట విశ్వరూపాన్ని చూపించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తేదీని ప్రకటించినా ఇప్పటి వరకు ఈ చిత్ర టైటిల్‌ను మాత్రం యూనిట్ తెలపకపోవడం గమనార్హం. దీంతో ఈ సినిమాను అంతా ‘బీబీ3’గానే సంబోధిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ‘మోనార్క్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర తీరుకు ఈ టైటిల్ అయితేనే సరిపోతుందని భావిస్తోన్న బోయపాటి దీనినే ఫైనల్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
Also Read: భూల్ భులయ్యా 2 సినిమా యూనిట్‌కు షాక్‌లు ఇస్తున్న సీనియర్ నటి టబు.. పెండింగ్‌లో ఉన్న సీన్లకు నో..!