Bhagavanth Kesari: చిచ్చా వచ్చాడు.. దుమ్మురేపిన భగవంత్ కేసరి సాంగ్ ప్రోమో..

|

Aug 31, 2023 | 9:03 AM

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. పెళ్లి చేసుకొని బిడ్డకు జన్మనించిన ;తర్వాత కాజల్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విదులైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి . ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

Bhagavanth Kesari: చిచ్చా వచ్చాడు.. దుమ్మురేపిన భగవంత్ కేసరి సాంగ్ ప్రోమో..
Bhagavanth Kesari
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. పెళ్లి చేసుకొని బిడ్డకు జన్మనించిన ;తర్వాత కాజల్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విదులైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి . ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రోమో ను రిలీహ్ చేశారు ఈ ప్రేమో అదిరిపోయింది. ఈ  సాంగ్ వినాయక చవితి స్పెషల్ గా రానుంది. ఈ ప్రోమోలో బాలయ్య , శ్రీలీల డ్యాన్స్ తో ఆకట్టుకోనున్నారు.

బిడ్డా చప్పుడు జర గట్టిగా చేయమను అంటూ బాలయ్య చెప్పడం.. మీ తీన్మార్ పక్కన పెట్టండి, మా చిచ్చా వచ్చిండు ఎట్లుండాలే, కొట్టర కొట్టు సౌమారే.. అంటూ శ్రీలీల చెప్పడం ఆసక్తిగా అనిపించింది.

భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఇద్దరు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ సీన్స్ తోపాటు.. అనిల్ మార్క్ కామెడి కూడా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..