
నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ 2 సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. మొదట గురువారం (డిసెంబర్ 4) రాత్రి ప్లాన్ చేసిన అఖండ 2 ప్రీమియర్స్ రద్దయ్యాయి. అయితే రెగ్యులర్ షోలు పడతాయని అశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అఖండ 2 సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు శుక్రవారం (డిసెంబర్ 05)అర్ధరాత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది 14 రీల్స్ నిర్మాణ సంస్థ.
‘అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల ఏం ఎంతగానో చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైనది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకుంటాం. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.
This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.
We are working…
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.