Balagam: ఇదేం చిత్రం గురూ! ఓటిటిలో రిలీజ్ అయినా కలెక్షన్స్ దంచుతున్న బలగం

|

Mar 25, 2023 | 8:59 PM

తాజాగా విడుదలైన బలగం సినిమా కూడా అందులో ఒకటి. నటుడు వేణు టిల్లు  దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బలగం. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Balagam: ఇదేం చిత్రం గురూ! ఓటిటిలో రిలీజ్ అయినా కలెక్షన్స్ దంచుతున్న బలగం
Balagam Movie
Follow us on

ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు.. కంటెంట్ ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తున్నాయి. చిన్న సినిమాలైనా కూడా సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా వచ్చి హిట్స్ అందుకున్నాయి. తాజాగా విడుదలైన బలగం సినిమా కూడా అందులో ఒకటి. నటుడు వేణు టిల్లు  దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బలగం. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అడియాన్స్ ను ఆకట్టుకుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన బలగం.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో బలగం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీలోనూ ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఇప్పటికీ ఈ సినిమా పలు థియటర్స్ లో రన్ అవుతోంది. ఇప్పటికే అదే రేంజ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఇంతలోనే ఊహించని విధంగా ఓటీటీలో ప్రత్యక్షం అయ్యింది. ఇక ఓటీటీలోనూ భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది ఈ సినిమా. అటు థియేటర్స్ లోనూ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. చాలా మంది ఈ సినిమా థియేటర్స్ లో చూడటానికి మక్కువ చూపిస్తున్నారు.

ఇప్పటికే ఈ ప్రపంచవ్యాప్తంగా 22.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక బలగం సినిమా తొలి రోజే 0.8 కోట్లు గ్రాస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకుపోతోంది ఈ చిత్రం. ఈ సినిమా పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.