Venu Yeldandi: వామ్మో.. ‘బలగం’ వేణులో ఈ టాలెంట్ కూడా ఉందా.. రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ కూడా

'బలగం' చిత్రంతో డైరెక్టర్​గా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్న హాస్యనటుడు వేణు - తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలిపారు? అసలు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఆర్టిస్టుగా మారడానికి ఆయన చేసిన ప్రయత్నాలేంటి? సహా పలు విషయాలను తెలిపారు.

Venu Yeldandi: వామ్మో.. బలగం వేణులో ఈ టాలెంట్ కూడా ఉందా.. రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ కూడా
Director Venu

Updated on: May 30, 2024 | 5:11 PM

 ‘బలగం’ మూవీతో దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు నటుడు వేణు.  ఇంటి పెద్ద కన్నుమూత నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు 25 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చిన అతను మొదట కొన్నాళ్ళ పాటు అసిస్టెంట్​గా పనిచేసి, ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ కెరీర్​లో ఉన్నత స్థానానికి ఎదిగారు. మున్నా సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత జబర్దస్త్ షోతో జనాలకు మరింత చేరువ అయ్యారు. ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం తన రెండో సినిమా కోసం పని చేస్తున్నారు.

అయితే  వేణు తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలిస్తే.. ఆయనలో ఈ టాలెంట్‌ కూడా ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. వేణు అమ్మానాన్నలు కూరగాయలు అమ్మేవారట. పావలా కొత్తి మీర అమ్మాలంటే ఎన్నో మాటలు చెప్పాలని… అలా మాటలు చెబుతూ, కూరలు అమ్ముకుంటూ తాను చదువుకున్నట్లు వేణు వెల్లడించారు. అయితే అందరి కన్నా ప్రత్యేకంగా ఉండాలని భావించి.. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నట్లు వేణు తెలిపారు. అందులో రెండుసార్లు స్టేట్‌ ఛాంపియన్‌గా కూడా నిలిచారట వేణు. కానీ, అప్పటికే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడిందని… ఏ సినిమా రిలీజైనా చూసేవాడినని వేణు తెలిపారు. అందరూ నన్ను బాబూమోహన్‌ బావమరిది అని పిలిచేవారని… దీంతో ఎలా అయినా సినిమాల్లోకి వెళ్లాలని ఇంటి నుంచి వచ్చేసినట్లు వేణు వెల్లడించారు.

కెరీర్‌ తొలునాళ్లలో నవకాంత్‌ అనే రచయిత దగ్గర మూడు నెలలు అసిస్టెంట్‌గా పని చేశాడు వేణు. ఆ తర్వాత ‘చిత్రం’ శ్రీను అసిస్టెంట్‌ కోసం వెతుకుతున్నారని తెలిసి, ఓ వ్యక్తి ద్వారా అక్కడ జాయిన్​ అయినట్లు వేణు తెలిపాడు. రెండు సంవత్సరాలు అక్కడే ఉండి పని చేసి చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న, చిన్న రోల్స్ చేసి.. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినట్లు వేణు తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి