SKN: బేబీ నిర్మాత ఇంట తీవ్ర విషాదం.. ఎస్.కే.ఎన్.కు పితృవియోగం

ఎస్.కే.ఎన్. ఇంట్ విషాదం నెలకొంది. ఎస్.కే.ఎన్ తండ్రి కన్నుమూశారు. దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండింది. ఎస్.కే.ఎన్. తండ్రి గాదే సూర్య ప్రకాష్ రావు హైదరాబాద్ లో తదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అనారోగ్యసమస్యల వల్ల సూర్య ప్రకాష్ రావు కన్నుమూశారని తెలుస్తోంది.

SKN: బేబీ నిర్మాత ఇంట తీవ్ర విషాదం.. ఎస్.కే.ఎన్.కు పితృవియోగం
Skn

Updated on: Jan 04, 2024 | 2:14 PM

చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన బేబీ సినిమాతో నిర్మాతగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఎస్.కే.ఎన్. బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో ఎస్.కే.ఎన్. పేరు మారుమ్రోగింది. ఇదిలా ఉంటే ఎస్.కే.ఎన్. ఇంట్ విషాదం నెలకొంది. ఎస్.కే.ఎన్ తండ్రి కన్నుమూశారు. దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండింది. ఎస్.కే.ఎన్. తండ్రి గాదే సూర్య ప్రకాష్ రావు హైదరాబాద్ లో తదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అనారోగ్యసమస్యల వల్ల సూర్య ప్రకాష్ రావు కన్నుమూశారని తెలుస్తోంది.

నిర్మాతగా ఎస్కేఎన్ విజయ్ దేవరకొండ తో కలిసి టాక్సీవాల సినిమా నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి బేబీ సినిమాను నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన మారుతి, రాహుల్ సాంకృత్యాన్, సాయి రాజేష్ లాంటి సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇలా  ఎస్.కే.ఎన్ తండ్రిని కోల్పోయారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. సూర్య ప్రకాష్ రావుకు నివాళులు అర్పిస్తున్నారు.

శ్రేయాస్ మీడియా ట్విట్టర్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.