Ayyappanum Koshiyum: చనిపోయిన తర్వాత ఈ దర్శకుడికి జాతీయ అవార్డు వరించింది..

|

Jul 23, 2022 | 4:13 PM

68 జాతీయ ఫిలిం ఫేర్ అవార్డులు ప్రకటన శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే.. ఈ అవార్డుల ప్రకటనలో మూడు తెలుగు సినిమాలు సత్తా చాటయి. బెస్ట్ తెలుగు మూవీగా కలర్ ఫోటో ఎంపిక అయ్యింది.

Ayyappanum Koshiyum: చనిపోయిన తర్వాత ఈ దర్శకుడికి జాతీయ అవార్డు వరించింది..
Kr Sachdanandan
Follow us on

68 జాతీయ ఫిలిం ఫేర్ అవార్డులు(68th National Film Awards) ప్రకటన శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే.. ఈ అవార్డుల ప్రకటనలో మూడు తెలుగు సినిమాలు సత్తా చాటయి. బెస్ట్ తెలుగు మూవీగా కలర్ ఫోటో ఎంపిక అయ్యింది. సుహాస్ ఎం చాందిని చౌదరి నటించిన ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇక బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సంధ్య రాజ్ నాట్యం సినిమాకు ఎంపిక అయ్యారు. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ అలవైకుంఠపురం లో సినిమాకు గాను ఎంపిక అయ్యారు. వీటితో పాటు హీరో సూర్య కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. అలాగే మలయాళం సినిమా  అయ్యప్పనుమ్ కోషియుమ్(Ayyappanum Koshiyum) కూడా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకు దర్శకత్వంవహించిన కె.ఆర్. సచిదానందన్ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. కానీ ఆయన గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే.

కె.ఆర్. సచిదానందన్ చనిపోయిన తర్వాత ఆయనకు బెస్ట్ డైరెక్టర్ గా జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇక అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో భీమ్లానాయక్ టైటిల్ తో ఈ సినిమా రీమేక్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. కె.ఆర్. సచిదానందన్ మరణం తర్వాత ఆయనకు జాతీయ అవార్డు దక్కడంతో కుటుంబ సభ్యులు సంతోషం తోపాటు ఒకింత భావోద్వేగానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి