Avantika Vandanapu: హాలీవుడ్​ మూవీలో తెలుగమ్మాయి అవంతిక వందనపు ..

బ్రహ్మోత్సవం, మనమంతా, ప్రేమమ్, అజ్ఞాతవాసి సినిమాల‌తో పాటు ప్రజాహక్కు అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అవంతిక వందనపు...

Avantika Vandanapu: హాలీవుడ్​ మూవీలో తెలుగమ్మాయి అవంతిక వందనపు ..
Avantika Vandanapu

Updated on: Jun 26, 2021 | 11:21 PM

బ్రహ్మోత్సవం, మనమంతా, ప్రేమమ్ (తెలుగు  చిత్రం ), అజ్ఞాతవాసి సినిమాల‌తో పాటు ప్రజాహక్కు అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అవంతిక వందనపు ఇప్పుడు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈమె హాలీవుడ్​ మూవీలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. అవంతిక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘స్పిన్’. డిస్నీ ఛానల్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా స్పిన్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయ కుటుంబంలో పుట్టిన రియా అనే అమ్మాయిగా అవంతిక ఆ మూవీలో నటించింది. సంగీతమంటే ఎంతో ఆరాధించే రియా.. డీజే మిక్సింగ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుందనేది స్పిన్ సినిమాలో చూపించబోతున్నారు. హాలీవుడ్ లో తన ఫ‌స్ట్ మూవీ విడుదలవుతుండటం పట్ల అవంతిక ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. అవంతిక.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు కూడా గీస్తుంది.

Also Read:  వీడిన చిక్కుముడి.. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధపతి ఆయ‌నే

ఆహా అందిస్తున్న మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్.. అమలపాల్ ప్రధాన పాత్రలో ‘కుడి ఎడమైతే’..