నేను మందు తాగితే మీకేంటి నష్టం.. ఎందుకు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు.. వేణు స్వామి ఆవేదన

వేణు స్వామి .. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు ఇది. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు ఈయన . సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు .

నేను మందు తాగితే మీకేంటి నష్టం.. ఎందుకు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు.. వేణు స్వామి ఆవేదన
Venu Swami

Updated on: Dec 25, 2025 | 7:06 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ, రాజకీయా ప్రముఖుల జాతకాలు చెప్పి తెగ వైరల్ అయ్యారు ఈయన. హీరో, హీరోయిన్స్ జాతకాలు, పెళ్లి, విడాకుల పై చాలా కామెంట్స్ చేసి మెప్పించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పై వస్తున్న ట్రోల్స్ , నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు. తాను ఎవరినీ లక్ష్యంగా చేసుకుని విమర్శించలేదని, అయితే తన ప్రతి మాటను మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ వ్యక్తి గురించైనా పది నిమిషాల్లో సమాచారాన్ని సేకరిస్తా.. అంత నెట్‌వర్క్ ఉందని, రాజకీయ నాయకులు, టీవీ ఛానెల్ యజమానులు, సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలను కూడా తెప్పించగల సామర్థ్యం ఉందని వేణు స్వామి అన్నారు. అయినప్పటికీ తాను ఎప్పుడూ ఎవరి విషయాలను బయటపెట్టలేదు అని అన్నారు వేణు స్వామి.

అలాగే తాను షేర్ చేసే సోషల్ మీడియా పోస్టులు బాహుబలి లాగా ఉంటాయని అన్నారు. తన సహనాన్ని పరీక్షించవద్దని, ఒక స్థాయికి మించి సహనం కోల్పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వేణు స్వామి హెచ్చరించారు. సమక్క సారలమ్మ జాతరలో మాంసం, మద్యం వినియోగం గురించి తాను చెప్పిన వాస్తవాన్ని హిందూ దేవతలను విమర్శించినట్లుగా ప్రచారం చేశారని వేణు స్వామి ఆరోపించారు. తెలంగాణ కల్చర్‌లో ఇది భాగమని, తాను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష, శివజ్యోతి వంటి వారిని ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, చిన్నపాటి విషయాలపైనే దృష్టి సారించడం సరికాదని అన్నారు.

టాటా, బిర్లా, అంబానీ వంటి వారు మంగల్ షాపులు, చెప్పుల షాపులు పెడితే తప్పుకానప్పుడు, తాను మందు తాగితే ఇతరులకు వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కామాఖ్యా దేవాలయం గురించి ప్రచారంలో ఉన్న అవాస్తవాలను వేణు స్వామి ఖండించారు. అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతాయని చెప్పడం అవాస్తవమని, అది ఓయో రూమ్ కాదని స్పష్టం చేశారు. కామాఖ్యా ఆలయం దశమహావిద్యలకు నిలయమని, అక్కడ పది మంది అమ్మవార్లు ఒక్కొక్క కోరికను తీరుస్తారని వివరించారు. డబ్బు, శత్రునాశనం, విలాసాలు, వశీకరణం వంటి వాటికి ఒక్కో దేవత ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలు కామాఖ్యా ఆలయానికి వెళ్లినప్పుడు చీకట్లో గమనించకుండా ముగ్గురు అమ్మవార్లను దర్శించుకోవాలని, అక్కడ ఉండే పంతులు గారిని అడిగి నీరు తాగి, ఒక రూపాయి బిల్ల అడిగి బీరువాలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. తాను స్వయంగా కొందరిని అక్కడికి తీసుకెళ్లి వాస్తవాలు చూపిస్తానని కూడా అన్నారు. దక్షిణాచారం, వామాచారం అనేవి వేర్వేరు మార్గాలని, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు వంటివి తంత్ర మార్గంలో ఉపయోగించేవిగా పేర్కొన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.