Nandamuri Taraka Ratna : ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీలో ఆ పాత్ర కోసం తారకరత్నను అనుకున్నారట.. అశ్వినీదత్ చెప్పిన అసలు విషయం

23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న శివరాత్రి రోజున కన్నుమూశారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Nandamuri Taraka Ratna : ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీలో ఆ పాత్ర కోసం తారకరత్నను అనుకున్నారట.. అశ్వినీదత్ చెప్పిన అసలు విషయం
Taraka Ratna

Updated on: Feb 22, 2023 | 8:50 PM

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబసభ్యుల్లో, అభిమానుల్లో విషాదం అలుముకుంది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫాన్స్. 23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న శివరాత్రి రోజున కన్నుమూశారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. విదేశీ వైద్యులు సైతం ప్రయత్నించినా కూడా ఆయననను కాపాడలేకపోయారు.

ఇటీవల తారకరత్నతో తన సినిమాలో ఒక పాత్ర చేయించాలనుకున్నా అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి సినిమా చేస్తున్నారు.. ఆ సినిమాలో తారకరత్నతో పాత్ర చేయించాలని అనుకున్నాం అని తెలిపారు.

అలాగే ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కే లో ఒక పాత్ర చేయాలని అనుకున్నారట. తాజాగా నిర్మాత  తారకరత్నతో ఒక కీలక పాత్ర చేయించాలని నేను, నాగ్ అశ్విన్ అనుకున్నాం.. మరికొద్ది రోజుల్లోనే ఆయనకు ఫోన్ చేసి విషయం తెలుపుదాం అనుకున్నాం.. కానీ ఇంతలోనే ఈ చేదు విషయాన్ని వినాల్సి వచ్చిందని అన్నారు అశ్వినీదత్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.