‘మేడమ్‌.. అది విగ్గా..?’ వైరల్‌ అవుతోన్న సీనియర్ నటి ఖుష్బూ లేటెస్ట్‌ హెయిర్‌ స్టైల్ ఫొటోలు

|

Aug 27, 2023 | 1:24 PM

సీనియర్‌ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ గురించి పరిచయం అక్కరలేదు. దక్షిణాది సినీవినీలాకంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్‌ ఖుష్బూ. 80-90 దశకంలో కుర్రకారు కలల రాణి. రజనీ, కమల్, ప్రభు, శరత్‌కుమార్, సత్యరాజ్, విజయకాంత్ వంటి దాదాపు అగ్ర హీరోలందరితో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన అగ్ర హీరోయిన్‌. ప్రస్తుతం తమిళ, తెలుగు వంటి..

మేడమ్‌.. అది విగ్గా..? వైరల్‌ అవుతోన్న సీనియర్ నటి ఖుష్బూ లేటెస్ట్‌ హెయిర్‌ స్టైల్ ఫొటోలు
Actress Khushpu
Follow us on

సీనియర్‌ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ గురించి పరిచయం అక్కరలేదు. దక్షిణాది సినీవినీలాకంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్‌ ఖుష్బూ. 80-90 దశకంలో కుర్రకారు కలల రాణి. రజనీ, కమల్, ప్రభు, శరత్‌కుమార్, సత్యరాజ్, విజయకాంత్ వంటి దాదాపు అగ్ర హీరోలందరితో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన అగ్ర హీరోయిన్‌. ప్రస్తుతం తమిళ, తెలుగు వంటి పలు భాషా చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఖుష్బూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే.

ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, సినిమా కబుర్లు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఖుష్బూ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఎప్పుడూ చీరకట్టులో, నుదుటిన బొట్టు, చక్కగా పాపిటలో సింధూరంతో సంప్రదాయబద్దంగా కనిపించే ఖుష్బూ.. ఒక్క సారిగా మోడ్రన్‌ గర్ల్ అయిపోయింది. కొత్త హెయిర్‌ స్టైల్‌లో విభిన్నంగా కనిపిస్తున్న తన ఫొటోలు ‘మార్పు అనివార్యం.. నయాలుక్‌, న్యూలుక్, న్యూస్టైల్..’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అంతే అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో ఖుష్బూ బరువు తగ్గి స్టైలిష్ గా కనిపించారు. పొట్టి హెయిర్‌ స్టైల్‌ హాట్‌గా కనిపించారు. ఇక ఈ ఫొటోలు చూసిన సెలబ్రెటీలతోపాటు, అభిమానులు కామెంట్ సెక్షన్‌లో ఖుష్బూని పొగడ్తలతో ముంచెత్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఖుష్బు జుట్టుకి ఏమైంది.. న్యూ హెయిర్ స్టైల్‌ తన కొత్త సినిమా కోసమా? లేదా సీరియల్ కోసమా? లేదా మీరే లుక్ మార్చేయాలనుకుంటున్నారా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ‘ఇది జోక్‌ కదా..’ అంటూ కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చారు. ఇక నటి త్రిష.. ఓ మై అంటూ నవ్వుతున్న ఎమోజీ యాడ్ చేశారు. నటి మాళవిక సూపర్ క్లాస్‌గా, చిక్‌గా ఉన్నారంటూ కామెంట్ చేశారు.

‘ఎవరిని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యారు.. మీ లాంగ్‌ హెయిరే బాగుంది, లుక్స్‌ స్టన్నింగ్‌, హెయిర్ స్టైల్ మార్చుకున్నారా.. లేక హెయిర్ కట్ చేయించుకుని విగ్గు పెట్టుకున్నారా? మీరు ఎలా ఉన్న అందంగానే ఉంటారు’ అంటూ పలువురు భిన్నంగా స్పందించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.