
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన దర్బార్ ఆడియో రిలీజ్ కార్యక్రమం.. శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో జరిగిన.. మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూ జరిగినంత సేపూ ఆడియో ఫంక్షన్‌లో నవ్వులు పువ్వులు పూసాయి. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి మణిరత్నం గెస్ట్‌గా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాత శుభాస్కరణ్ గురించి నాకు కొన్ని నిజాలు తెలిసాయన్నారు. లైకా పేరిట.. ఎన్నో కంపెనీలను స్థాపించారని.. ఒక వ్యక్తి అంతలా ఎలా ఎదిగాడని.. అతనిపై బయోపిక్ తీయాలని ఉందని అన్నారు.
ఆ సమయంలో.. డైరెక్టర్ మురుగదాస్.. ఫంక్షన్‌లో లేరు. అనంతరం ఆయన కూడా వచ్చి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతుండగానే.. ఫంక్షన్‌కు హాజరైన.. ప్రేక్షకులతో పాటు.. నటీనటులు కూడా.. నవ్వులు చిందించారు. ఇద్దరూ ఒకే విషయం గురించి మాట్లాడటంతో.. వీరిలో ఎవరు శుభాస్కరణ్ బయోపిక్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇద్దరూ కలిసి ఆయనపై బయోపిక్ తీసినా.. శుభాస్కరణ్ పాత్రలో ఎవరు నటిస్తారనేది కుతూహలంగా ఉంది.
ఈ సినిమాకి మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. లైకా శుభాస్కరణ్ నిర్మాతగా వ్యవహరించారు. పాన్ ఇండియా చిత్రంగా దర్భార్ రూపొందుతోంది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. ప్రేక్షకుల ముందుకు రానుంది.